Dasara Traffic Diversion : మూలా నక్షత్రం రోజు విజయవాడలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు-dasara traffic diversion in vijayawada on mula nakshatram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Dasara Traffic Diversion In Vijayawada On Mula Nakshatram

Dasara Traffic Diversion : మూలా నక్షత్రం రోజు విజయవాడలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

B.S.Chandra HT Telugu
Oct 01, 2022 07:19 AM IST

Dasara Traffic Diversion ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలి రానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మ వారిని దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలి రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా తెలిపారు.

విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Dasara Traffic Diversion మూల నక్షత్రం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు అమలు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు ప్రకటించారు. దసరా ఉత్సవాల సందర్భంగా, మూల నక్షత్రం రోజున అమ్మ వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం గా వాహనముల రాకపోకలను మళ్ళిస్తున్నట్లు ప్రకటించారు.

అక్టోబర్ 1 రాత్రి 11 గంటల నుండి 2వ తేదీ రాత్రి 11 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు Dasara Traffic Diversion కొనసాగనున్నాయి. Dasara Traffic Diversion భాగంగా లోబ్రిడ్జి, గద్దబొమ్మ, కే.ఆర్. మార్కెట్ మరియు కనకదుర్గా ఫ్లైఒవర్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళు సిటీ, ఆర్.టి.సి బస్సులను పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నుండి -పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌- చల్లపల్లి బంగ్లా - ఏలూరు లాకులు - బి.ఆర్.టి.ఎస్ రోడ్ - బుడమేరు వంతెన - పైపుల రోడ్ - వై.వి.రావు ఎస్టేట్ - సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ - సితారా - గొల్లపూడి వై జంక్షన్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపుకు పంపుతారు. పి.యన్.బి.యస్ సిటి బస్ స్టాండ్ నుండి లో బ్రిడ్జి వైపుకు ఆర్.టి.సి.బస్సులకు అనుమతించరు.

2. ప్రకాశం బ్యారేజి మీదుగా తాడేపల్లి, మంగళగిరి వైపు వెళ్ళు వాహనములు కనక దుర్గమ్మ వారధి మీదుగా వెళ్ళాలి.

3. భవానిపురం వైపు నుండి నగరంలోకి వచ్చు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనములు కుమ్మరిపాలెం -సితారా -కబెళా-సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ - మిల్క్ ప్రాజెక్ట్ -చిట్టినగర్ - వి.జి.చౌక్ - పంజా సెంటర్ - పండిట్ నెహ్రు రోడ్ మీదుగా లో బ్రిడ్జి నుంచి నగరములోనికి అనుమతిస్తారు.

4. పి.సి.ఆర్ వైపు నుండి భవానిపురం వైపు వెళ్ళు కార్లు ద్విచక్ర వాహనములు లోబ్రిడ్జి - కె.ఆర్.మార్కెట్ - బి.ఆర్.పి. రోడ్ - పంజా సెంటర్ - వి.జి.చౌక్ చిట్టినగర్- సొరంగం - సితారా -గొల్లపూడి బై పాస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

తాడేపల్లి వైపు నుండి ప్రకాశం బ్యారేజి మీదుగా విజయవాడలోకి, సీతమ్మవారి పాదాల వైపు నుండి ప్రకాశం బ్యారేజి - పి.ఎస్.ఆర్ విగ్రహం - ఘాట్ రోడ్ - కుమ్మరిపాలెం వరకు మరియు కనక దుర్గా ఫ్లైఒవర్ మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించరు.

హైదరాబాద్ నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకల మళ్లిస్తారు.

ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు వాహనాలు మళ్లిస్తారు.

విశాఖపట్నం నుండి చెన్నై మరియు చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ – పామర్రు - అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలు జిల్లా మీదుగా మళ్లించారు.

గుంటూరు నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి గుంటూరు వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహనాలు గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు వద్ద , తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్ళించారు.

చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను. హైదరాబాద్‌ నుంచి వచ్చే రవాణా వాహనాలు నార్కెట్ పల్లి మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనములను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశములలో మాత్రమే పార్క్ చేయాలని భక్తులు తమ వాహనములను ఇతర ప్రాంతములలో పార్క్ చేసి భక్తుల రాకపోకలకు అంతరాయము కలిగించవద్దని విజ్ఞప్తి.

IPL_Entry_Point