Forest University In Telangana : తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ.. ఎక్కడో తెలుసా?-forest university bill introduced in telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Forest University Bill Introduced In Telangana Assembly

Forest University In Telangana : తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ.. ఎక్కడో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Sep 12, 2022 10:39 PM IST

Telangana Assembly : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు 2022 సభ ముందుకు వచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ (tsassembly)

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మెుత్తం ఏడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం బిల్లు 2022ను ప్రవేశపెట్టింది. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను విశ్వవిద్యాలయంగా మారుస్తూ.. బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం. అటవీ శాస్త్రంలో కోర్సులను అందించే మొట్టమొదటి రకం విశ్వవిద్యాలయం ఇది.

అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణకు అర్హులైన అటవీ వృత్తి నిపుణులను తయారు చేసేందుకు లక్ష్యంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది.

అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ఏడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు) (సవరణ) బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు-2022ను మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.

తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) బిల్లు 2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (విశ్వాసం యొక్క వయస్సు నియంత్రణ) (సవరణ) బిల్లు 2022 అసెంబ్లీ ముందుకొచ్చింది. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు 2022, తెలంగాణ మోటారు వాహనాల పన్ను (సవరణ) బిల్లు 2022 వంటి ఇతర బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

IPL_Entry_Point