Analysis On TS Politics: అరుపులు కొండంత.. చర్యలు గోరంత-bjp vs kcr analysis on telangana present politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Vs Kcr Analysis On Telangana Present Politics

Analysis On TS Politics: అరుపులు కొండంత.. చర్యలు గోరంత

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 09:03 AM IST

Telangana Politics : తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. కేసుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇందులో అరుపులు కొండంత.. చర్యలు గోరంత అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణలో కొంతకాలంగా రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. దర్యాప్తు సంస్థలతో రాజకీయాలు చేస్తున్నాయి...! 'మీకు ఈడీ, సీబీఐ ఉంటే.. మాకు సిట్ ఉంది.. మీరు లిక్కర్ స్కాం తవ్వితే.. మేం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తవ్వుతాం..' అని టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా మినీ యుద్ధమే జరగుతుంది. ఇదంతా ఎలా ఉందంటే.. మీరు గోకినా.. గోకపోయినా.. మేం గోకుతూనే ఉంటామని కేసీఆర్ చెప్పిన డైలాగ్.. రెండు పార్టీలకు సరిపోయేలా ఉంది. అయితే అరుపులు మాత్రమే పెద్దగా వినిపిస్తున్నాయి.. చర్యలు మాత్రం గోరంతగా కనిపిస్తున్నాయి.

లిక్కర్ స్కామ్ వర్సెస్ ఫార్మ్ హౌస్ ఫైల్స్

ఇక అవినీతిని అరికట్టాలనే లక్ష్యంతో రూపొందించిన దిల్లీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ ఇప్పుడు రూల్స్, ప్రొసీజర్స్ ఉల్లంఘించినట్టుగా బహిర్గతమైంది. ఎన్నో ఆరోపణలతో కూరుకుపోయింది. ఇప్పుడు ఈ కేసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఇంటి గుమ్మం వరకు వచ్చింది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానానికి సన్నిహితంగా ఉండే.. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి. దీంతో కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ 'ఫార్మ్ హౌస్ ఫైల్స్'ను తెరపైకి తీసుకొచ్చింది.

వారంతా అమాయకులా?

దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వివరణ కోరేందుకు.. కవిత ఇంటికి వెళ్లింది సీబీఐ. వివరణ ఇచ్చేందుకు ఆమె గోప్యత హక్కు కలిగి ఉందని, ఆమె ఇచ్చిన తేదీల్లో ఒక తేదీని తీసుకొని.. ఆమె ఇంటి వద్దకే వెళ్లింది. అయితే కేంద్ర దర్యాప్తు చర్యలతో.. ఇది రాజకీయమా? పాలసీ ఇంతేనా? లేదంటే.. రెండూ కలిపా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దిల్లీ మద్యం కుంభకోణంలో కవితతోపాటు ఇతరులపై ఆరోపణలు వచ్చాయి. వారంతా అమయకులా? లేదా అనేది చట్టమే తేల్చాల్సి ఉంది.

ముఖాముఖి పోరు

ఆకస్మాత్తుగా ఒక రాష్ట్ర సీఎం కుమార్తె ఇంటికి సీబీఐ వచ్చి వివరణ తీసుకోవడంతో సహజంగానే హైప్ క్రియేట్ అయింది. అయితే ఇది పరిశీలకులను నిరాశకు గురిచేస్తుందా? లేదా? అనేది కాలమే చెప్పాలి. కేసీఆర్ కుటుంబ పాలనపై ఆరోపణలు, మరోవైపు బీజేపీపై ఫామ్ హౌస్ కేసు ఆరోపణలతో ఒకప్పుడు నిశ్శబ్ద మిత్రులుగా ఉన్న.. కేసీఆర్, బీజేపీ ఇప్పుడు ముఖాముఖి పోరు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వారి రాజకీయం రాష్ట్ర ప్రజలను అలరిస్తోంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై.. గులాబీ పార్టీ నాయకత్వం ఎదురుదాడి చేయడంలో..., తెలంగాణ రాజకీయ సూపర్‌ హీరో కేసీఆర్‌ ఇక నిలబడేలా కనిపించడం లేదు. ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌ కేసు వివరాలు.. రామ్ గోపాల్ వర్మ హారర్ సీక్వెల్స్ స్క్రిప్ట్ లాగా లక్ష్యం లేనిదిగా ఉన్నట్టుగా విమర్శలు ఉన్నాయి.

మేం పవిత్రమైన వాళ్లం

మరోవైపు, ఫామ్ హౌస్ ఫైల్స్ కేసు ఆరోపణల తర్వాత 'నైతికత' మరియు 'మేం పవిత్రమైన వాళ్లం' అనే చెప్పే బీజేపీ కాస్త అపహాస్యం అయింది. ఆ తర్వాత తేరుకొని ఎమ్మెల్యేల వేట కేసులో టీఆర్ఎస్ చేస్తున్న వాదనలు, చూపిస్తున్న వీడియో క్లిప్పులను నకిలీవని చెప్పుకుంటోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై సిట్ ఇచ్చిన హాజరు నోటీసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ఫామ్‌హౌస్ ఫైల్స్ చుట్టూ జరిగిన నాటకీయత అంతా ఇంతా కాదు. సంతోష్ నేరానికి పాల్పడ్డాడా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

సరిగ్గా గమనిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కేసు క్లైమాక్స్ వచ్చినట్టుగా, పెద్దగా జనాల మధ్య కూడా చర్చ లేదు. ఇక తాజాగా దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ కదలికలు.. కవిత ఇంటి వరకు వెళ్లాయి. కవిత పాత్రను ప్రశ్నించేందుకు సీబీఐ వేసిన అడుగులతో టీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మళ్లీ మెుదలవుతున్నాయి.

ఇరుపార్టీల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలు తారాస్థాయికి వెళ్లాయి. అయితే రెండు పార్టీల తీరు, అవినీతి ఆరోపణలు, కౌంటర్ ఆరోపణల చుట్టూ వారి ప్రస్తుత ఎత్తుగడలు సాగుతున్నాయి. ఇవి చట్టబద్ధంగా, రాజకీయంగా తెలివిగా ఉన్నాయా అనే లెక్కలేనన్ని సందేహాలకు దారితీస్తున్నాయి.

విశ్వసనీయతపై ఆందోళన

దిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె పాత్ర ఉందన్న ఆరోపణలపై కేసీఆర్ తన విశ్వసనీయత క్షీణించడంపై ఖచ్చితంగా ఆందోళన చెందుతున్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పటికీ ఓడిపోయే యుద్ధంలో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, కేసీఆర్‌ను ఓడించడానికి బీజేపీకి ఓ ఎత్తుగడ అవసరం.. ఎందుకంటే, హిందుత్వ రాజకీయాలు ఆశించిన ఫలితాలను ఇవ్వని రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ వ్యూహం రచించవలసి ఉంటుంది.

ఎమ్మెల్యేలను వేటాడిన కేసులో కేసీఆర్, ఆయన గ్యాంగ్ వాదనలన్నీ బలంగా, మీ కంటే పవిత్రమైన వాళ్లమని చూపుతున్న సమయంలోనే.. బీజేపీ ప్రధాన కార్యదర్శికి సిట్ నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. కాషాయ పార్టీ అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడకు షాక్ తగిలినట్టైంది. అయితే, రెండు పార్టీల మధ్య ఈ చిచ్చు అకస్మాత్తుగా చిన్నవిషయంగా మారింది.

ఆయుధం అవుతుందా?

ఈ వ్యవహారం న్యాయవ్యవస్థకు చేరే వరకూ ఇరుపార్టీలు మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే చేసుకున్నారు. మురికి నారను ఉతికి.. ఉతికి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న పార్టీల మధ్య ఇప్పుడు జరుగుతున్న ఘర్షణ రాజకీయంగా ఆయుధంగా అవుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఈ రెండు రాజకీయ పార్టీలూ.. ఇప్పటి వరకు చిత్రీకరించిన తీరు, ఆయుధాలను తయారు చేసుకున్న తీరు అయితే సూపర్ హిట్ అనిపించుకుంది. కానీ 'ఫార్మ్ హౌస్ ఫైల్స్' ఘటన మరియు కవితపై వచ్చిన ఆరోపణలలో కొత్తదనం ఏమీ లేదు.

ఇరు పార్టీలు ఈ విషయాలపై గట్టిగానే అరుచుకోవచ్చు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు కోసం వేటాడిందని బీజీపీపై ఆరోపణలు, ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టాలనే కాషాయ పార్టీ ఆశయం లాంటివాటితో కాస్త బీజేపీకి నష్టమే. అయితే దిల్లీ మద్యం కుంభకోణంలో తన కూతురు పాత్ర ఉందని ఆరోపిస్తున్నందున కేసీఆర్ ఒక చేయి వెనుకకు కట్టి యుద్ధం చేస్తున్నట్టుగానే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన డ్రామా అంతా ఏంటంటే, రాజకీయాల్లో మీ కంటే మేం పవిత్రమైన వారిమే అని చూపించుకునేదాగా వెళ్లింది. అయితే ఇది పార్టీల అభిమానుల వరకూ తాకింది.

ఏమో మళ్లీ కలిసిపోవచ్చేమో..

భారత రాజకీయాల్లో గొప్ప ఏంటంటే.. మీ కంటే మేం గొప్ప వాళ్లమని క్రియేట్ చేసుకుని.. ప్రజలను ఓ ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తే చాలు. ఆ తర్వాత జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక సమయంలో కేసీఆర్, బీజేపీకి మధ్య రాజీ జరగొచ్చు. ఏదో ఒకరోజు మరోసారి ఒకరికొకకు అవసరమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న రాజకీయాల్లో రెండు పార్టీల నాయకత్వానికి ఇలాంటి వాటి నుంచి మినహాయింపు లేదు.

ముగింపు ఇస్తారా?

ఇప్పటివరకు జరిగినదంతా గమనిస్తే.. కేసీఆర్ బీజేపీ నాయకత్వాన్ని, మరోవైపు బీజేపీ చేస్తున్నదంతా.. ఒకరి శక్తి ఒకరు పెంపొందించే మార్గంగానే కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు చాలని ఇరు నాయకత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు పార్టీలు.. మూర్ఖత్వంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఎండ్ పాయింట్ ఇచ్చేందుకు ఇష్టపడవు. జరిగిన మొత్తం నాటకానికి రెండు పార్టీలకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.

బాధితురాలు కాంగ్రెస్ పార్టీ

మొత్తం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ హైప్ మధ్య బాధితురాలు తెలంగాణ కాంగ్రెస్‌గా కనిపిస్తుంది. ఇది తిరిగి మళ్లీ యుద్ధంలో పోరాడే స్థితికి చేరుకోలేదు. కాంగ్రెస్ కొంతకాలంగా తడబడుతోంది. దాదాపు 'తెలంగాణ చోడో' అనే భావనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మునుగోడు, ఇతర ఉపఎన్నికలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కేసీఆర్ పాలనపై ఓటర్లు కోపంగా ఉన్నప్పటికీ, వారు కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చూడడానికి విముఖత చూపుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కేసీఆర్‌కు సరైన పోటీ బీజేపీనే అని నమ్ముతున్నారు.. ఆ విషయాన్నే ఇష్టపడుతున్నారు. మెుత్తానికి తెలంగాణ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ధ్వనిస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం