Bhuvneshwar Kumar: పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా టీ20ల్లో కొత్త రికార్డ్ నెల‌కొల్పిన భువ‌నేశ్వ‌ర్‌-asia cup bhuvneshwar kumar breaks hardik pandya rare record against pakistan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bhuvneshwar Kumar: పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా టీ20ల్లో కొత్త రికార్డ్ నెల‌కొల్పిన భువ‌నేశ్వ‌ర్‌

Bhuvneshwar Kumar: పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా టీ20ల్లో కొత్త రికార్డ్ నెల‌కొల్పిన భువ‌నేశ్వ‌ర్‌

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 06:28 AM IST

Bhuvneshwar Kumar:పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో కొత్త రికార్డ్ ను నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏదంటే...

<p>భువనేశ్వర్ కుమార్</p>
భువనేశ్వర్ కుమార్ (twitter)

Bhuvneshwar Kumar:ఆదివారం ఆసియా క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ అద్భుతంగా రాణించాడు. అత‌డి స్వింగ్ మెరుపుల‌తో పాకిస్థాన్ 147 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. నాలుగు ఓవ‌ర్లు వేసి 26 ర‌న్స్ ఇచ్చిన భువ‌నేశ్వ‌ర్ నాలుగు వికెట్లు తీశాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్‌తో పాటు షాబాద్ ఖాన్‌,ఆసిఫ్ అలీ వికెట్లు తీసి టీమ్ ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

కాగా ఈ మ్యాచ్ ద్వారా పాక్‌పై టీ20ల్లో అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన భార‌త బౌల‌ర్‌గా భువనేశ్వర్ రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ హార్దిక్ పాండ్య పేరు మీద ఉంది. 2016 ఆసియా కప్ లో పాండ్య ఎనిమిది రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ రికార్డ్ ను ఆదివారం జరిగిన మ్యాచ్ ద్వారా భువనేశ్వర్ బ్రేక్ చేశాడు.

టీ20 చరిత్రలో భారత్, పాక్ ఇరు జట్ల నుండి కూడా ఇది రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం. 2007లో మహమ్మద్ ఆసిఫ్ టీమ్ ఇండియాపై 18 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అతడి తర్వాతి స్థానంలో భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.

Whats_app_banner