తెలుగు న్యూస్ / ఫోటో /
Year Ender 2023: 2023లో భారీ నష్టం చేకూర్చిన ప్రకృతి వైపరీత్యాలు
- Year Ender 2023: మెక్సికోను అతలాకుతలం చేసిన ఓటిస్ హరికేన్ నుంచి సిరియా-టర్కీ భూకంపం వరకు, 2023లో భారీ నష్టం చేకూర్చిన ప్రకృతి వైపరీత్యాల వివరాలు..
- Year Ender 2023: మెక్సికోను అతలాకుతలం చేసిన ఓటిస్ హరికేన్ నుంచి సిరియా-టర్కీ భూకంపం వరకు, 2023లో భారీ నష్టం చేకూర్చిన ప్రకృతి వైపరీత్యాల వివరాలు..
(1 / 6)
2023లో, భారీ ప్రకృతి వైపరీత్యాలు పలు దేశాల్లో విధ్వంసం సృష్టించాయి. వాటిలో మొరాకో, టర్కీల్లో సంభవించిన భూకంపాలు, చైనా, లిబియాలను ముంచెత్తిన వరదలు ఉన్నాయి. (Representative Image (Getty Images via AFP))
(2 / 6)
ఆగస్ట్‌లో చైనా తీవ్రమైన రుతుపవన వర్షాలు, వరుస తుపానులను ఎదుర్కొంది, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు దేశంలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. టైఫూన్ సావోలా సెప్టెంబర్ లో దక్షిణ చైనాను అతలాకుతలం చేసింది. దీని కారణంగా 8,80,000 మంది నిరాశ్రయులయ్యారు. డోక్సూరి టైఫూన్ వల్ల బీజింగ్‌లో 83 గంటల్లో సాధారణ సంవత్సరంలో 60% కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.(REUTERS)
(3 / 6)
డేనియల్ తుపాను తూర్పు లిబియాలో వినాశకరమైన వరదలకు కారణమైంది, దీని తీవ్రతకు ఆనకట్టలు విరిగి పడ్డాయి. తీరప్రాంత పట్టణాల్లోని నివాస ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా 4,300 మందికి పైగా మరణించారు.(Marwan Alfaituri via REUTERS)
(4 / 6)
Morocco Earthquake: సెప్టెంబర్ 8వ తేదీన 11 గంటల సమయంలో మొరాకోలో 18.5 కిలోమీటర్ల లోతులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.
(5 / 6)
Hurricane Otis: హరికేన్ Otis అక్టోబర్ 25 న మెక్సికో పసిఫిక్ తీరంలో విరుచుకుపడింది. మెక్సికోను అత్యంత తీవ్రంగా నష్టపర్చిన తుపాను ఇది.
ఇతర గ్యాలరీలు