
(1 / 5)
ఏకాంతం మంచిదే కానీ, ఒంటరితనం మంచిది కాదు. ఏకాంతం సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఒంటరితనం ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది. ఒంటరి తనం మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక ఒంటరితనం మనల్ని మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా బలహీనులను చేస్తుంది. ఈ ఒంటరితనం మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో న్యూరోసైంటిస్ట్స్ వివరిస్తున్నారు.
(Unsplash)
(2 / 5)
దీర్ఘకాలిక ఒంటరితనంతో బాధపడేవారు తరచుగా గుంపులో ఒంటరిగా అనుభూతి చెందుతారు. మన ప్రియమైనవారు చుట్టుముట్టినప్పుడు కూడా ఒంటరితనం అనుభవిస్తుంటారు.
(Unsplash)
(3 / 5)
దీర్ఘకాలిక ఒంటరితనంతో బాధపడుతున్నవారిని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గుర్తించి, వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. సామాజికంగా వారిని చురుకుగా ఉండేలా చూడాలి. దీర్ఘకాలిక ఒంటరితనంతో ప్రభావితమైన మెదడుకు అల్జీమర్స్ సమస్య తలెత్తుతుంది.
(Unsplash)
(4 / 5)
అంతర్ముఖులు, లేదా ఇంట్రావర్ట్ లను ఒంటరితనం చాలా లోతుగా, తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంతర్ముఖులు తమతో లేదా తమకు సౌకర్యంగా ఉన్న వ్యక్తులతో మాత్రమే సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతారు.
(Unsplash)
(5 / 5)
అంతర్ముఖులకు దీర్ఘకాలిక ఒంటరితనం తీవ్రత అధికంగా ఉంటుంది. వారు తమ సమస్యలను, బాధలను, అనుభూతులను చాలా తక్కువ మందితో, తక్కువ సార్లు మాత్రమే పంచుకుంటారు. అందువల్ల, వారు దీర్ఘకాలిక ఒంటరితనం బారిన ఎక్కువగా పడుతుంటారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు