Nidhhi Agerwal: నిధి అగర్వాల్ డబుల్ ట్రీట్ - రెండేళ్ల నిరీక్షణకు పుల్‌స్టాప్!
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. హీరో మూవీతో 2022 ఆరంభంలో చివరగా తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది నిధి అగర్వాల్. హీరో డిజాస్టర్ కావడంతో నిధికి మరో అవకాశం దక్కలేదు.
(1 / 5)
టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తోంది నిధి అగర్వాల్. ఈ బ్యూటీ నిరీక్షణకు ఈ ఏడాది తెరపడటం ఖాయంగానే కనిపిస్తోంది.
(2 / 5)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లుతో పాటు ప్రభాస్ రాజాసాబ్ సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
(3 / 5)
నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హరిహరవీరమల్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో యువరాణిగా నిధి అగర్వాల్ కనిపిస్తోంది.
(4 / 5)
రాజా సాబ్ సెట్స్‌లో నిధి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌తోనే రాజాసాబ్‌లో నిధి నటించబోతున్నట్లు మేకర్స్ ఆఫీషియల్‌గా వెల్లడించారు.
ఇతర గ్యాలరీలు