తెలుగు న్యూస్ / ఫోటో /
Ind vs NZ 2nd Test: తొలి రోజే స్పిన్నర్లకు పదికి పది వికెట్లు.. గతంలో ఐదుసార్లు.. ఆ సెంటిమెంట్ కొనసాగుతుందా?
- Ind vs NZ 2nd Test: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే ఇండియన్ స్పిన్నర్లు చెలరేగి పదికి పది వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నారు. గతంలోనూ ఇలా తొలి రోజే స్పిన్నర్లకు పదికి పది వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి.
- Ind vs NZ 2nd Test: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే ఇండియన్ స్పిన్నర్లు చెలరేగి పదికి పది వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నారు. గతంలోనూ ఇలా తొలి రోజే స్పిన్నర్లకు పదికి పది వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి.
(1 / 8)
Ind vs NZ 2nd Test: పుణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తొలి రోజే ఇండియన్ స్పిన్నర్లు చెలరేగారు. మొత్తం పది మంది న్యూజిలాండ్ బ్యాటర్లను స్నిన్నర్లే ఔట్ చేయడం విశేషం.(PTI)
(2 / 8)
Ind vs NZ 2nd Test: వాషింగ్టన్ సుందర్, అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 259 పరుగులకే కుప్పకూలింది. సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లు తీశారు. తొలి రోజే స్పిన్నర్లు పది వికెట్లు తీసిన సందర్భాలు తక్కువే అయినా.. గతంలోనూ ఉన్నాయి.(PTI)
(3 / 8)
Ind vs NZ 2nd Test: ఈ ఏడాది ఇంగ్లండ్ తో ఐదో టెస్టును ధర్మశాలలో టీమిండియా ఆడింది. అందులో తొలి రోజే స్పిన్నర్లు 10 వికెట్లు తీసుకున్నారు.(PTI)
(4 / 8)
Ind vs NZ 2nd Test: ఆ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 15 ఓవర్లలో 75 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 11.4 ఓవర్లలో 51 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.(PTI)
(5 / 8)
Ind vs NZ 2nd Test: అంతకుముందు 1973లో చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో భారత్ తలపడింది. అప్పట్లో అజిత్ వాడేకర్ టీమ్ఇండియా కెప్టెన్ గా ఉన్నాడు. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను భారత్ 242 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో భగవత్ చంద్రశేఖర్ 6 వికెట్లు తీయగా, బిషన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్న చెరో 2 వికెట్లు తీశారు. (AP)
(6 / 8)
Ind vs NZ 2nd Test: ఇక 1964లో చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ ప్రత్యర్థిని 211 పరుగులకే ఆలౌట్ చేసింది. బాపు నాదకర్ణి 5, ఏజీ కిర్పాల్ సింగ్ 3, సలీమ్ దురానీ 2 వికెట్లు తీశారు. కానీ ఆ మ్యాచ్ లో ఇండియా 139 పరుగుల తేడాతో ఓడిపోయింది.(Jay Shah-X)
(7 / 8)
Ind vs NZ 2nd Test: 1956లోనూ ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ లో తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థిని 177 పరుగులకే ఆలౌట్ చేసింది ఇండియన్ టీమ్. భారత బౌలర్లలో గులాం అహ్మద్ 7 వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ 2, సుభాష్ గుప్తే 1 వికెట్ తీశారు. అయినా ఈ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియా 94 పరుగులతో గెలిచింది.(ANI )
ఇతర గ్యాలరీలు