తెలుగు న్యూస్ / ఫోటో /
KTM 890 SMT: అడ్వెంచర్స్ ను ప్రేమించే వారి కోసం కేటీఎం 890 ఎస్ఎంటీ సూపర్ బైక్
KTM 890 SMT: అడ్వెంచరస్ ప్రయాణాలను ఇష్టపడేవారి కోసం కేటీఎం నుంచి వచ్చిన సూపర్ అడ్వెంచరస్ టూరర్ బైక్ కేటీఎం 890 ఎస్ఎంటీ. వెడల్పాటి హ్యాండిల్ బార్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 17 ఇంచ్ వీల్స్ తో ఇది ట్రూలీ అడ్వెంచరస్ బైక్ గా మార్కెట్లోకి వస్తోంది.
(1 / 7)
KTM 890 SMT కేటీఎం నుంచి వచ్చిన రెండో ఎస్ఎంటీ మోడల్ ఇది. 2009లో 990 ఎస్ఎంటీ వచ్చింది. దాన్ని 2013లో డిస్కంటిన్యూ చేశారు.
(2 / 7)
KTM 890 SMT: ఇందులో 890 సీసీ పారెలల్ ట్విన్ ఇంజిన్ ఉంది. దీని పవర్ ఔట్ పుట్ 8000 ఆర్పీఎం వద్ద 105 హెచ్ పీ. ఇది 6 స్పీడ్ యూనిట్. ఈ బైక్ ఎయిర్ బాక్స్ ను మోడిఫై చేశారు.
(3 / 7)
ఈ బైక్ స్ట్రాంగ్ పౌడర్ కోటెడ్ క్రోమియం మాలిబ్డెనమ్ స్టీల్ ఫ్రేమ్ ను ఉపయోగించారు. ముందు వైపు అపెక్స్ 43 ఎంఎం సస్పెన్షన్, వెనుకవైపు డబ్ల్యూపీ అపెక్స్ మోనో షాక్ ను అమర్చారు.
(4 / 7)
ఈ అడ్వెంచర్ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ లో ముందువైపు ట్విన్ రేడియల్లీ మౌంటెడ్ 4 పిస్టన్ కాలిపర్ తో ట్విన్ 320 ఎంఎం డిస్క్స్ ను, వెనుకవైపు 2 పిస్టన్ కాలిపర్ తో 260 ఎంఎం డిస్క్ ను అమర్చారు.
(5 / 7)
KTM 890 SMT: ఈ బైక్ బరువు 194 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 227 ఎంఎం. ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.8 లీటర్లు.
(6 / 7)
ఈ బైక్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి రెయిన్, స్ట్రీట్, స్పోర్ట్. వీటితో పాటు అదనంగా ట్రాక్ మోడ్ కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు