తెలుగు న్యూస్ / ఫోటో /
Bentley Bentayga EWB Azure : బెంట్లే నుంచి మరో లగ్జరీ ఎస్యూవీ లాంచ్.. ధర ఎంతంటే
- Bentley Bentayga EWB Azure : బెంట్లే నుంచి మరో లగ్జరీ ఎస్యూవీ ఇండియాలో అడుగుపెట్టింది. అదే.. బెంట్లే బెంటేగా ఈడబ్ల్యూబీ అజూర్. ఈడబ్ల్యూబీ అంటే.. ఎక్స్టెండేడ్ వీల్‌బేస్. ఇందులో 4.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 582 బీహెచ్పీ పవర్‌ను, 770 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్‌ను కేవలం 4.6 సెకన్లలోనే ఇది అందుకోగలదు. ఈ వెహికిల్ టాప్ స్పీడ్ 290కేఎంపీహెచ్.

(1 / 5)
బెంటేగా ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ అజూర్‌ను లాంచ్ చేసింది బెంట్లే. ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ భాగస్వామ్యంతో ఈ లగ్జరీ వాహనాన్ని ఇండియాలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 6కోట్లు(Bentley Motors)
(2 / 5)
సాధారణ బెంటేగాకు, ఈ కొత్త మోడల్‌కు ఉన్న అతిపెద్ద వ్యత్యాసం.. దీని ఎక్స్టెండెడ్ వీల్‌బేస్. ఈ ఎస్యూవీ వీల్‌బేస్‌ను 180ఎంఎంలు పెంచింది బెంట్లే(Bentley Motors)
(3 / 5)
బ్యాక్ డోర్ వద్ద పొడవు పెరిగినట్టు తెలుస్తోంది. ఫలితంగా వెనకాల కూర్చునే వారికి మరింత లెగ్‌రూమ్ లభిస్తుంది.(Bentley Motors)
(4 / 5)
ఇందులో ఎయిర్‌లైన్ సీట్స్ ఉంటాయి. వీటిని 22 విధాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఆటో క్లైమేట్ సెన్సింగ్ సిస్టెమ్, పోస్చ్యురల్ అడ్జెస్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.(Bentley Motors)
ఇతర గ్యాలరీలు