దుర్గం చెరువుకు మరో అట్రాక్షన్, కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా మ్యూజికల్ ఫౌంటైన్లు-hyderabad tourist place durgam cheruvu musical fountain shows ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  దుర్గం చెరువుకు మరో అట్రాక్షన్, కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా మ్యూజికల్ ఫౌంటైన్లు

దుర్గం చెరువుకు మరో అట్రాక్షన్, కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా మ్యూజికల్ ఫౌంటైన్లు

Sep 26, 2023, 06:49 PM IST HT Telugu Desk
Sep 26, 2023, 06:43 PM , IST

  • హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జికు ఇరువైపులా రెండు మ్యూజికల్ ఫౌంటైన్‌లను దాదాపు 8 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది.

పర్యాటక ప్రదేశాలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హైదరాబాద్ దుర్గం చెరువును ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. హుస్సేన్‌ సాగర్‌ తరహాలో ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువును తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 

(1 / 6)

దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఎంతగానో ఆకట్టుకోగా.. ఇప్పుడు దుర్గం చెరువుకు మరింత సొగబులు జోడించేందుకు, కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా రెండు మ్యూజికల్ ఫౌంటైన్‌లను దాదాపు 8 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ( HMDA ) అభివృద్ధి చేసింది.

(2 / 6)

ఈ కలర్ ఫుల్ ఫ్లోటింగ్ ఫౌంటైన్ల పరిమాణం 60 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు. ఈ ఫౌంటెన్ ప్రభావం 20 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల మధ్య 15 నిమిషాల పాటు 3 షోలు నిర్వహించనున్నారు. శని, ఆది ప్రభుత్వ సెలవు దినాల్లో 4 షోలు నిర్వహించనున్నారు. 

(3 / 6)

200 మంది ఒకేసారి కూర్చొని మ్యూజిక్ ఫౌంటైన్లను వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటైన్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆయన  ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. 

(4 / 6)

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి అధికారులు HMDA అధికారుల బృందం సోమవారం ప్రారంభించారు. 

(5 / 6)

కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫౌంటైన్లు ఆ ప్రాంతానికి మరింత అందాన్ని చేకూర్చాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు