తెలుగు న్యూస్ / ఫోటో /
Mumbai rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు; విమానాల ఆలస్యం, ట్రాఫిక్ గందరగోళం
Mumbai rains: ముంబైని శుక్రవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
(1 / 6)
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయమైంది. జూలై 11-12 ఉదయం నుంచి కొలాబాలో 86 మిల్లీమీటర్లు, శాంటా క్రూజ్లో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.(Satish Bate/Hindustan Times)
(2 / 6)
భారత వాతావరణ శాఖ శనివారం వరకు ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, నగరంలోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.(Satish Bate/Hindustan Times)
(3 / 6)
ఈ నెల 15 వరకు ముంబై నగరంతో పాటు పరిసర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. (Satish Bate/Hindustan Times)
(4 / 6)
శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో ముంబై నగరం తడిసి ముద్దైంది. సబర్బన్ రైల్వే స్టేషన్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోకల్ ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైలో 3 గంటల్లో 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.(PTI)
(5 / 6)
నగరంలో జలమయం కావడంతో బస్సు రూట్లను కూడా దారి మళ్లించారు. నగరానికి జీవనాడి అయిన పబ్లిక్ సబర్బన్ రైళ్లలో జాప్యం జరుగుతోందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. (Satish Bate/Hindustan Times)
ఇతర గ్యాలరీలు