APSRTC: వరదలతో ఏపీఎస్‌ఆర్టీసీకి అపార నష్టం, డిపోలను పరిశీలించిన డీజీపీ-ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు-dgprtc md dwaraka tirumala rao inspected the depots huge damage to apsrtc due to floods ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Apsrtc: వరదలతో ఏపీఎస్‌ఆర్టీసీకి అపార నష్టం, డిపోలను పరిశీలించిన డీజీపీ-ఆర్టీసీ Md ద్వారకా తిరుమలరావు

APSRTC: వరదలతో ఏపీఎస్‌ఆర్టీసీకి అపార నష్టం, డిపోలను పరిశీలించిన డీజీపీ-ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు

Sep 09, 2024, 07:10 AM IST Bolleddu Sarath Chandra
Sep 09, 2024, 07:10 AM , IST

  • APSRTC: అకాల వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా అత‌లాకుత‌ల‌మైన వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయ‌ని డీజీపీ,ఆర్టీసీ  ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు తెలిపారు.నీట మునిగిన ఆర్టీసీ డిపోను డీజీపీ పరిశీలించారు. నీట మునిగిన బస్సులను, గ్యారేజిని, స్క్రాప్ యార్డ్‌ను స్వయంగా వీక్షించారు. 

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. విద్యాధరపురం డిపో పూర్తిగా నీట మునిగి ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. ఈ నేప‌ధ్యంలో ఆదివారంనాడు ఆర్టీసీ సంస్థ ఎండీ, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు డిపోను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. విద్యాధ‌ర‌పురం సెంట్రల్ హాస్పిటల్, మందుల స్టోరేజీ విభాగం, బస్సు డిపో, ట్రాన్స్‌పోర్ట్ అకాడెమీ, జోనల్ స్టోర్స్, టైర్స్ విభాగం, స్క్రాప్ యార్డు ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్ధితులను గమనించి, సంబందిత అధికారులకు సూచనలు జారీ చేశారు. 

(1 / 5)

విద్యాధరపురం డిపోలో 41 కొత్త బస్సులు లోపల ఉన్న అవి ఏ విధంగానూ డ్యామేజీ కాలేదని, వాటన్నింటికినీ పూర్తీ స్థాయిలో పరిక్షలు నిర్వహిస్తామని డీజీపీ తెలిపారు. ఆర్టీసీ వర్క్ షాప్, టైర్ రీట్రేడింగ్ సెంటర్ కూడా నీట మునిగాయి. ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ మునిగి ఉద్యోగుల కోసం నిల్వ ఉంచిన అనేక రకాల మందులు పాడైయ్యాయి. ట్రాన్స్ పోర్ట్ అకాడమి, న్యూ వెహికల్ స్టోరేజి యార్డ్, జోనల్ స్టోర్స్ విభాగాల్లో నీరు చేరడంతో  నష్టం వాటిల్లింది. 

(2 / 5)

వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్, ఫైర్ సిబ్బంది, గ్రే హౌండ్స్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను స‌మ‌న్వయం చేసినట్టు డీజీపీ తెలిపారు. నగరప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం వరద బాధితులకు తోడుగా ఉందని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో చాలా మంది నీళ్ళల్లో మరియు బురదలో నడుచుకుని వెళ్ళడాన్ని సీఎం చంద్ర‌బాబు గమనించి వారికోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయమని ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలకు వారిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, ఈ బస్సులు విజయవాడ సిటీలో రోజుకు 594 ట్రిప్పులు వేసి 18 వేల మందిని వేర్వేరు ప్రాంతాలకు తరలించామ‌ని డీజీపీ చెప్పారు. 

(3 / 5)

వ‌ర‌ద‌ల వల్ల ఇక్కడ విద్యాధరపురం  పరిసరాల్లో నివసించే ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా మంది నష్ట పోయారని డీజీపీ వివరించారు. కొన్నిచోట్ల ఆర్టీసీ కార్యాలయాలు, బస్సులు దెబ్బతిన్నాయని వీటి నష్టం అంచనా వేస్తున్నామని ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ సంస్థ చాలా పెద్ద సంస్థ అని, వీలైనంత తొందరగా ఈ కష్ట పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా సంస్థ ముందుకెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ఆర్మీ, మిలిటరీ సిబ్బంది త‌ర‌హాలో ఆర్టీసీ కూడా తనవంతు సేవల‌ను ప్రజలకు అందిస్తున్నారని వివరించారు. 

(4 / 5)

వరద బాధితుల  రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్టీసీ బస్సులను కేటాయించామ‌ని,  వరద బాధితుల కోసం ఆర్టీసీ, పోలీసు డిపార్ట్మెంట్లు వరదల్లోనే పనిచేస్తున్నాయని డీజీపీ తెలిపారు. ఆర్టీసీలో  కొన్ని డిపోలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని ఏపీ డీజీపీ ద్వారా తిరుమలరావు  తెలిపారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు