తెలుగు న్యూస్ / ఫోటో /
Bumrah Record: బుమ్రా అరుదైన రికార్డు.. పాకిస్థాన్ పేస్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఘనత
- bumrah record: టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో పాకిస్థాన్ పేస్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ బౌలర్ అతడే కావడం విశేషం. గతంలో విరాట్ కోహ్లి కూడా బ్యాటర్ల ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిచాడు.
- bumrah record: టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో పాకిస్థాన్ పేస్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ బౌలర్ అతడే కావడం విశేషం. గతంలో విరాట్ కోహ్లి కూడా బ్యాటర్ల ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిచాడు.
(1 / 6)
bumrah record: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో నెలకొల్పిన రికార్డును ఇప్పుడు బుమ్రా రిపీట్ చేశాడు.
(2 / 6)
bumrah record: ఇంగ్లండ్ తో రెండో టెస్టులో 9 వికెట్లు తీసిన బుమ్రా బుధవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకుల్లో నంబర్ వన్ అయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ బుమ్రానే. ఇక మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన తొలి ఆసియా బౌలర్ కూడా బుమ్రానే కావడం విశేషం. గతంలో విరాట్ కోహ్లి బ్యాటర్ల ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ అయిన తొలి ఆసియా బ్యాటర్ గా నిలిచాడు.(PTI)
(3 / 6)
bumrah record: టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఒకేసారి వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ గా నిలిచిన తొలి ఆసియా ప్లేయర్ విరాట్ కోహ్లి. ఇప్పుడు బౌలర్లలో ఆ ఘనతను బుమ్రా సొంతం చేసుకున్నాడు.(PTI)
(4 / 6)
bumrah record: బుమ్రా 2018లో తొలిసారి వన్డేల్లో నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. ఆ తర్వాత 2022, జులైలో టీ20ల్లోనూ ఈ ఘనత దక్కించుకున్నాడు. తాజాగా టెస్టుల్లోనూ నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. టెస్టుల్లో గతంలో ఏ ఇండియన్ పేస్ బౌలర్ ఈ ఘనత సాధించలేదు.(AP)
(5 / 6)
bumrah record: 2017లో తొలిసారి టీ20 క్రికెట్ లో బుమ్రా వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.(PTI)
(6 / 6)
bumrah record: విరాట్ కోహ్లి విషయానికి వస్తే అతడు 2018 ఆగస్ట్ లో తొలిసారి టెస్టుల్లో నంబర్ వన్ అయ్యాడు. ప్రస్తుతం అతడు ఏడో ర్యాంకులో ఉన్నాడు. ఇక 2013 అక్టోబర్ లోనే వన్డేల్లో కోహ్లి నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్నాడు. 2014 సెప్టెంబర్ లో టీ20ల్లో తొలిసారి నంబర్ వన్ గా నిలిచాడు. ఇప్పుడు 46వ స్థానానికి పడిపోయాడు.(AFP)
ఇతర గ్యాలరీలు