తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Murder Mystery: డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఈ బెస్ట్ 6 ఓటీటీ మర్డర్ మిస్టరీలను చూసేయండి!
Best 6 OTT Murder Mystery Web Series To Watch: ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వాటిలో వివిధ జోనర్స్ ఉంటాయి. అయితే, మర్డర్ మిస్టరీ జోనర్‌ను ఇష్టపడేవారికి ఈ ఆరు ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసులు డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి.
(1 / 7)
హిందీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చూడటానికి చాలా వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆరు ఓటీటీ వెబ్ సిరీస్‌ల కథ వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ డోస్ దొరుకుతుంది.
(2 / 7)
క్యాండీ: ఈ వెబ్ సిరీస్ కథ రుద్రకుండ్ స్కూల్‌లో జరుగుతుంది. అక్కడ ఒకరి తర్వాత ఒకరి హత్యలు జరుగుతాయి. దానికి కారణం ఏంటనేదే ఈ క్యాండీ వెబ్ సిరీస్ కథ. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌ను ఫ్యామిలీతోపాటు ఎంచక్కా వూట్ ఓటీటీలో వీక్షించవచ్చు.
(3 / 7)
నెట్ ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న డార్క్ కామెడీ, క్రైమ్ వెబ్ సిరీస్ హస్‌ముఖ్. 11 ఎపిసోడ్స్ ఉన్న క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్‌లో సీరియల్ కిల్లర్ అయిన కమెమడియన్ కథగా తెరకెక్కింది.
(4 / 7)
చిన్న చిన్న విషయాలకు కోపగించుకుని ప్రతీకారం కోసం ప్రజల కళ్లు తిప్పుకునే మతిస్థిమితం లేని వ్యక్తి కథతో రూపొందిన మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇరు ధురువం. 9 ఎపిసోడ్స్ నిడివి ఉన్న ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌ను సోనీ లివ్ ఓటీటీలో వీక్షించవచ్చు.
(5 / 7)
ప్రాజెక్ట్ 9191 ఓటీటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అల్గారిథమ్స్, బిహేవియర్ ప్రిడిక్షన్ ఆధారంగా తెరకెక్కిన సోనీ లివ్ వెబ్ సిరీస్ ‘ప్రాజెక్ట్ 1919’ మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు.
(6 / 7)
మొత్తం 17 ఎపిసోడ్లతో మూడు విభిన్న కథలతో 3 సీజన్స్‌తో ఉన్న థ్రిల్లర్ వెబ్ సిరీస్ రహస్య రోమాంచ, 7.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎక్స్ ప్లేయర్‌లో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు