తెలుగు న్యూస్ / ఫోటో /
Home Made Face Packs : బ్యూటి పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే తయారుచేసే ఫేస్‌ప్యాక్‌లు ఇవే
- Natural Face Packs : ఫేస్‌ప్యాక్‌లు చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఫేషియల్ చేయించుకోవడానికి, మీ ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే పండ్లతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

(1 / 6)
కూరగాయలు, పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ చర్మం గురించి తెలుసుకోండి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఉన్నాయి.
(2 / 6)
యాపిల్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖ చర్మంపై అప్లై చేయండి. పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది.
(3 / 6)
నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తలస్నానానికి ముందు ముఖానికి పట్టించి పదినిమిషాలు అలాగే ఉంచి తలస్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది.
(4 / 6)
పండిన అరటిపండును నుజ్జు నుజ్జు చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేసి మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది పొడి చర్మం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది.
(5 / 6)
దోసకాయ రసంలో శనిగ పిండిని కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ముఖం మెరుస్తుంది.
ఇతర గ్యాలరీలు