Bharat Jodo Yatra@1000km: ‘కర్నాటకలో నడుస్తోంది కమిషన్ ప్రభుత్వం‘-rahul says karnataka bjp regime anti sc st alleges it is a commission govt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Yatra@1000km: ‘కర్నాటకలో నడుస్తోంది కమిషన్ ప్రభుత్వం‘

Bharat Jodo Yatra@1000km: ‘కర్నాటకలో నడుస్తోంది కమిషన్ ప్రభుత్వం‘

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 04:48 PM IST

Bharat Jodo Yatra@1000km: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర శనివారం కీలక మైలురాయికి చేరుకుంది. కర్నాటకలో కొనసాగుతున్న ఈ యాత్ర శనివారం 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.

<p>రాహుల్ గాంధీ బళ్లారి సభకు లక్షలాదిగా హాజరైన జన సందోహం</p>
రాహుల్ గాంధీ బళ్లారి సభకు లక్షలాదిగా హాజరైన జన సందోహం

Bharat Jodo Yatra@1000km: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పదన లభిస్తోంది. తమిళనాడులో ప్రారంభించి, కేరళ గూండా, కర్నాటకలో అడుగుపెట్టి విజయవంతంగా 1000 కిమీల దూరాన్ని ఈ యాత్ర ముగించింది.

Bharat Jodo Yatra@1000km: బళ్లారి లో భారీ సభ

భారత్ జోడో యాత్ర 1000 కిమీలు విజయవంతంగా కొనసాగిన సందర్భంగా కర్నాటకలోని బళ్లారిలో కాంగ్రెస్ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు కర్నాటకలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

Bharat Jodo Yatra@1000km: 40% కమిషన్ ప్రభుత్వం

కర్నాటకలో అవినీతి రాజ్యమేలుతోందని, 40% కమిషన్ ఇస్తే ప్రభుత్వంలో ఏ పని ఐనా ఐపోతుందని విమర్శించారు. ‘పోలీస్ విభాగంలో ఎస్ ఐ ఉద్యోగం కావాలంటే రూ. 80 లక్షలు ఇస్తే చాలు.. మెరిట్ లేకున్నా ఉద్యోగం వచ్చేస్తుంది. నిజాయితీగానే సంపాదించాలనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు సాధ్యం కాదు’ అని రాహుల్ విమర్శించారు. కర్నాటకలో ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేటీఎం తరహాలో ‘పేసీఎం’ పాలన నడుస్తోందని విమర్శిస్తోంది.

<p>బళ్లారి సభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ</p>
బళ్లారి సభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ (PTI)

Bharat Jodo Yatra@1000km: ఎస్సీల నిధులను కూడా దోచేశారు

కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని రాహుల్ విమర్శించారు. వారి నిధులను కూడా దోచేస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, నేరాలు 50% పెరిగాయని, ఈ ప్రభుత్వం దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వంమని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర కర్నాటక నుంచి తెలంగాణలో ప్రవేశిస్తుంది. యాత్ర ఊహించని స్థాయిలో విజయవంతం కావడంపై కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.

Whats_app_banner