Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా.. భారత్ ఫైర్
China renames places in Arunachal Pradesh : భారత్‌తో సరిహద్దు వివాదాన్ని మరింత తీవ్రం చేసే విధంగా చైనా తాజాగా ఓ ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను మార్చేసింది. దీనిని ఇండియా తీవ్రంగా ఖండించింది.
China renames places in Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 పేర్లను మారుస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చర్యలను ఖండించింది. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్‌లో అంతర్గత భాగమే అని తేల్చిచెప్పింది.
చైనా.. మరో కుట్ర..!
టిబెట్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ భూమిలో భాగమేనని చైనా చెబుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను 'జాంగ్నన్- టిబెట్‌లోని దక్షిణ భాగం'గా సంబోధిస్తుంది చైనా. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని 11 ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను చైనా మార్చడం ఇది మూడోసారి. 2018, 2021లో కొన్ని ప్రాంతాల పేర్లు మార్చింది. 2018లో ఆరు, 2021లో ఏకంగా 15 ప్రాంతాల పేర్లు మార్చేసింది.
Arunachal Pradesh latest news : తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 5 పర్వతాల శిఖరాలు, 2 భూభాగాలు, రెండు నివాసిత ప్రాంతాలు, రెండు నదుల పేర్లను తాజాగా మార్చింది చైనా.
'పేర్లు మారిస్తే.. ఏం మారిపోదు..'
చైనా వ్యవహారంపై భారత్ ఘాటుగా స్పందించింది. పేర్లు మార్చినంత మాత్రాన.. వాస్తవం అన్నది మారిపోదని పేర్కొంది.
China India border dispute : "చైనా నివేదికను మేము చూశాము. ఇలాంటి పనులు చేయడం చైనాకు ఇది కొత్తేమీ కాదు. దీనిని మేము ఖండిస్తున్నాము. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ.. ఇండియా భూమిలో భాగమే. కొత్త కొత్త పేర్లు సృష్టించి పెట్టేసినంత మాత్రాన వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు," అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్ బగ్చి తెలిపారు.
చైనాతోనే ఉద్రిక్తత..!
1950లో టిబెట్‌ను సైనిక శక్తితో స్వాధీనం చేసుకుంది చైనా. 1959లో దలైలామా.. టిబెట్‌ను విడిచి అరుణాచల్‌ప్రదేశ్ మార్గంలో ఇండియాకి చేరారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు.
India China relation : ఇక గతేడాది డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనా- భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. చైనా దళాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.
సంబంధిత కథనం