Vijay TVK : జన సందోహం మధ్య విజయ్​ తొలి రాజకీయ సభ- లైవ్​ వీడియో..-huge crowd swarm at actor vijay led tamilaga vettri kazhagams first conference ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vijay Tvk : జన సందోహం మధ్య విజయ్​ తొలి రాజకీయ సభ- లైవ్​ వీడియో..

Vijay TVK : జన సందోహం మధ్య విజయ్​ తొలి రాజకీయ సభ- లైవ్​ వీడియో..

Sharath Chitturi HT Telugu
Oct 27, 2024 06:04 PM IST

Vijay TVK : టీవీకే పార్టీని స్థాపించిన అనంతరం తొలిసారి రాజకీయ సభను నిర్వహించారు ప్రముఖ నటుడు విజయ్​. తమిళనాడు విల్లుపురం జిల్లాలో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యాయి.

విల్లుపురం జిల్లాలో టీవీకే తొలి రాజకీయ సభ డ్రోన్​ వ్యూ..
విల్లుపురం జిల్లాలో టీవీకే తొలి రాజకీయ సభ డ్రోన్​ వ్యూ.. (PTI)

భారీ జన సందోహం మధ్య ప్రముక నటుడు విజయ్​ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి రాజకీయ సభ ఘనంగా జరిగింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్​కి పార్టీ కార్యకర్తలు, ప్రజలు, హీరో అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వారందరిని విజయ్​ పలకరిస్తూ ముందుకు కదిలిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియలో వైరల్​గా మారాయి.

ఈ సదస్సులో పార్టీ రాజకీయ సిద్ధాంతాలు, విధానాలు, రోడ్ మ్యాప్​ను ప్రకటిస్తానని గతంలోనే విజయ్​ చెప్పారు.

తన ప్రియమిత్రుడు విజయ్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఉదయనిధి స్టాలిన్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం విజయ్​కి శుభాకాంక్షలు తెలియజేశారు.

“తమిళనాడు ప్రజల మద్దతు, అభిమానంతో రాజకీయ జర్నీని విజయంవంతంగా సాగిస్తున్నాను. మా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, అనుసరించే నాయకుల వివరాలను తెలియజేసేందుకు ఈ నెల 27న విల్లుపురం జిల్లా విక్రవండి వీ సలై గ్రామంలో తొలి రాజకీయ సదస్సును నిర్వహిస్తున్నాను,” అని టీవీకే చీఫ్​ విజయ్​ గతంలో వెల్లడించారు.

తమ సదస్సుకు సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గ్రౌండ్ వర్క్ ప్రారంభం కావాల్సి ఆయన ఉందన్నారు. “ఈ సదస్సు ద్వారా బలమైన రాజకీయ మార్గాన్ని నిర్దేశించుకుందాం,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భారత ఎన్నికల సంఘం సెప్టెంబర్ 8న తమిళగ వెట్రి కళగంను రాజకీయ పార్టీగా అధికారికంగా నమోదు చేసింది. రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీకి అనుమతి ఇచ్చింది.

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన అనంతరం నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం అధికారికంగా తమిళగ వెట్రి కళగంను రాజకీయ పార్టీగా నమోదు చేసి, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తుందని తెలిపారు. నటుడు, టీవీకే అధినేత విజయ్ తమిళనాడు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని నొక్కి చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు 22న తమిళగ వెట్రి కళగం (టీవీకే) జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన విజయ్ తాను అందరిని సమానంగా చూస్తూ, సమానత్వం అనే సూత్రాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇటీవలే తన పార్టీని ప్రకటించారు.

ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం 2026 ఏడాదితో ముగిస్తుంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం