Earthquake in Punjab : పంజాబ్‌లో భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు!
Earthquake in Punjab today : సోమవారం తెల్లవారుజామున పంజాబ్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది.
Earthquake in Punjab today news 2022 : పంజాబ్‌లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్‌లో భూకంపం తీవ్రత.. రిక్టార్ స్కేలుపై 4.1గా నమోదైంది.
సోమవారం తెల్లవారుజామున 3:42 గంటలకు పంజాబ్‌లో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ ప్రకటించింది.
"4.1 తీవ్రతతో 14-11-2022 తెల్లవారుజామున 3:42:27లకు.. అమృత్‌సర్‌కు 145కి.మీల దూరంలో భూకంపం సంభవించింది. లాట్" 31.95, లాంగ్: 73.38గా రికార్డు అయ్యింది," అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ ట్వీట్ చేసింది.
భయం గుప్పిట్లో ఉత్తర భారతం..
Earthquake in Punjab today : ఉత్తర భారతంలో భూకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో.. ఈ నెలలోనే రెండుసార్లు భూమి కంపించింది. తొలుత ఈ నెల 9న.. నేపాల్ కేంద్రబిందువుగా సంభవించిన భూకంపం తీవ్రత.. ఢిల్లీని కూడా తాకింది. ఆ తర్వాత.. నేపాల్‌లో ఈ నెల 12న 5.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అదే సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
భూకంపం ఘటనలతో ఉత్తర భారత ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం భూమి కంపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల 1న తేదీన.. మధ్యప్రదేశ్‌లోనూ భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 3.9గా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని పచమర్హిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి 10కి.మీల లోపల భూకంపం సంభవించింది.
Earthquake in Delhi : ఈ ఘటనకు కొన్ని గంటల ముందే.. 1వ తేదీ తెల్లవారుజామున అరుణాచల్ ప్రదేశ్‌లోనూ భూకంపం సంభవించింది. టవాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్ర 3.7గా నమోదైంది.
అదే సమయంలో మహారాష్ట్రలో కూడా భూకంపం సంభవించినట్టు తెలిసింది. పాల్గఢ్ జిల్లాలోని దహను ప్రాంతానికి 13కి.మీల దూరంలో భూమి కంపించినట్టు సమాచారం.
దహను ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు నమోదవుతూ ఉంటాయి. 2018 నుంచి ఇక్కడ భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దుండల్వాడి గ్రామంలో భూ ప్రకంపనలు అధికంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు నిత్యం భయం భయంగా జీవిస్తూ ఉంటారు.
తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదవుతుండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగడం లేదు.
Earthquake today news అంతకుముందు.. సెప్టెంబర్ నెల చివర్లో మయన్మార్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవిచంగా.. ఆ ప్రకంపనలు ఈశాన్య భారతంలోనూ నమోదయ్యాయి.
ఇక ఆగస్టు నెలలో ఉత్తర భారతంలో భూకంపాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. జమ్ముకశ్మీర్‌లో.. 3 రోజుల్లో వరుసగా 7సార్లు భూమి కంపించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే.. ఉత్తర్‌ప్రదేశ్ లక్నో, బిహార్‌లో పలుమార్లు భూ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
సంబంధిత కథనం