Xiaomi Notebook Pro 120G। ఆపిల్ మాక్‌బుక్‌ను పోలి ఉన్న షావోమి సరికొత్త నోట్‌బుక్
షావోమి నుంచి Xiaomi Notebook Pro 120G ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. ఇందులో ఉత్తమమైన ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాల కోసం చదవండి.
చైనీస్ టెక్ కంపెనీ షావోమి తమ నోట్‌బుక్ లైనప్‌ను విస్తరిస్తూ సరికొత్త Xiaomi Notebook Pro 120G ని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త ల్యాప్‌టాప్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, Intel Core i5 12th-Gen ప్రాసెసర్‌లు సహా మరెన్నో ఉత్తమమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది.
ఈ ల్యాప్‌టాప్‌లలో 87 బ్యాక్‌లిట్ కీలు ఉన్నాయి. ఇందులోని 56Wh సామర్థ్యం కలిగిన బ్యాటరీ 100W ఫాస్ట్-ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనితో 35 నిమిషాల్లో సున్నా నుండి 50%కి ఛార్జింగ్ అవుతుంది. కంటిపై భారం పడకుండా వైడ్ కలర్ గామట్, DC డిమ్మింగ్, తక్కువ బ్లూ లైట్ ఎమిషన్ కలిగి ఉంటుంది.
Aerospace గ్రేడ్6 అల్యూమినియం, CNC ప్రెసిషన్ కట్‌లను ఉపయోగించి తయారు చేయటం వలన ఫిట్టింగ్ నుంచి అంచుల ఫినిషింగ్ అంతా ప్రీమియం లుక్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్‌లు 15.9mm మందం ఉండగా, 1.4 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటాయి. మొత్తంగా వీటి డిజైన్ ఇటీవలి Apple MacBooksని పోలి ఉంది.
Xiaomi Notebook Pro 120G ల్యాప్‌టాప్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కలిగిన బేసిక్ వేరియంట్ ధర రూ. 69,999 కాగా, Nvidia MX550 GPU వేరియంట్ Xiaomi Notebook Pro 120G ధర రూ.74,999
ఈ రెండు ల్యాప్‌టాప్ వెర్షన్‌లు సెప్టెంబర్ 20, 2022 నుంచి Mi Home, Amazon, Mi.com లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ఎప్పట్నించి అందుబాటులో ఉంటుంది? తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.
Xiaomi Notebook Pro 120G ల్యాప్‌టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 14 అంగుళాల 2.5K Mi TrueLife డిస్‌ప్లే
- 16 GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- Intel Core i5 12th-Gen H45 ప్రాసెసర్
- Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 50Whr లిథియం-పాలిమర్ బ్యాటరీ, 100W ఛార్జర్
ఇంకా Thunderbolt 4 పోర్ట్, HDMI పోర్ట్, 3.5mm ఆడియో పోర్ట్ , USB టైప్-A పోర్ట్‌లతో పాటు వైఫై 6, బ్లూటూత్ 5.2, స్టీరియో స్పీకర్లు, పవర్ బటన్‌లో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Xiaomi Notebook Pro 120G రెండు ల్యాప్‌టాప్ వెర్షన్‌లు సెప్టెంబర్ 20, 2022 నుంచి Mi Home, Amazon, Mi.com లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
సంబంధిత కథనం