Wednesday Motivation : గతము చేసిన గాయమన్నది నుదిటి రాత మార్చేనా?-wednesday motivation on let your past make you better not bitter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation On Let Your Past Make You Better Not Bitter

Wednesday Motivation : గతము చేసిన గాయమన్నది నుదిటి రాత మార్చేనా?

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 14, 2022 06:48 AM IST

Wednesday Motivation : గతం అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి మంచినిస్తే.. మరికొందరికి చెడుని ఇస్తుంది. మంచినిస్తే ఎదుటివారికి ఆదర్శంగా చెప్తాము. కానీ చెడునిస్తే.. ఆ తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాము. కానీ ఆ గతం మిమ్మల్ని నిలువునా దహించివేస్తుంటే మాత్రం మీరు మీ గతంతో బ్రేక్ తీసుకోవాలి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : గతం గతః. ఇది అందరూ మరోసారి గుర్తు చేసుకోవాల్సిన మాట. ఎందుకంటే మీ భవిష్యత్తు, కాదు కాదు మీ ప్రస్తుతం బాగుండాలి అన్నా.. మీ గతాన్ని వదిలి ముందుకు వెళ్లాలి. అలా వెళ్తేనే మీ భవిష్యత్తు మారుతుంది. గతం నేర్పిన పాఠాలను మరిచిపోకూడదు. కానీ గతం చేసినా గాయాలనుంచి బయటకు వస్తేనే.. మీకు, మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్నవారికి మంచిది.

గతంలోనే ఉండాలి అనుకున్నప్పుడు.. గతంలో మీకు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. ఏ విషయమైన ఎక్కువ విషాదాన్ని నింపింది అంటే కచ్చితంగా దానిలో ఎంతో కొంత మీకు మంచి గుర్తులు, జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అవి మీకు తెలియని ప్రశాంతతను ఇస్తాయి. ఎందుకంటే జీవితంలో ఎప్పటికి జరగవు అనుకున్నవి అప్పుడు మీకు జరిగి ఉండొచ్చు. అవి ఇప్పుడు లేవు కాబట్టే మీ బాధ మిమ్మల్ని దహించి వేస్తూ ఉండొచ్చు. కాబట్టి గతం చేసినా గాయాన్ని మీరే తగ్గించుకోవాలి. ఆ మంచి జ్ఞాపకాలే గాయానికి మందుగా మార్చుకోవాలి.

మీ వర్తమానం, భవిష్యత్తు కోసం ముందుకు సాగడంలో తప్పులేదు. భవిష్యత్తును నాశనం చేసే గతాన్ని వదిలివేయడమే మంచిది. మీ గతం మీ ప్రస్తుత జీవితాన్ని నియంత్రించేలా చేయొద్దు. మీరు గతం గురించి విచారిస్తూ కూర్చొంటే.. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందలేరు. దీనికి మీకు ఎవరూ సహాయంం కూడా చేయలేరు.

మీ గతం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మంచిదే కానీ.. ఆపేస్తుంటే మాత్రం మీరు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. గతం నేర్పిన అనుభవాలను మీ విజయానికి సాధనంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే.. మీ గతాన్ని మరచిపోయి కొత్తగా ప్రారంభించడం అయినా చేయాలి. అంతేకానీ అక్కడే శిలలా ఆగిపోకూడదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్