Tuesday motivation : ఒకరిని మనం నమ్మట్లేదంటే రెండు కారణాలు ఉంటాయి.. అవి ఏంటంటే..-tuesday motivation on there are two main reasons why we don t trust people ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation On There Are Two Main Reasons Why We Don't Trust People.

Tuesday motivation : ఒకరిని మనం నమ్మట్లేదంటే రెండు కారణాలు ఉంటాయి.. అవి ఏంటంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 13, 2022 06:45 AM IST

Tuesday motivation : ఒకరిని నమ్మడం అంత సులువు కాదు. ఓ వ్యక్తిపై నమ్మకం రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అయితే ఒక వ్యక్తిని నమ్మకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ వ్యక్తి గురించి మనకి ఏమి తెలియకపోవడం. మరొకటి పూర్తిగా తెలిసి ఉండడం. ఈ రెండు కారణాల వల్లనే మనం తొందరగా ఇతరులను నమ్మలేము.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday motivation : నమ్మకం అనేది వాళ్లు చేసే పనులపై.. లేదా వారి చుట్టూ వల్ల వచ్చే అవకాశముంది. అయితే వాళ్లతో ట్రావెల్ చేస్తున్న తరుణంలో మనం వారిని నమ్మాలో వద్దో అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎప్పుడైనా ఓ వ్యక్తిని నమ్మకపోవడానికి వారి గురించి తెలియడం ఒక రీజన్ అయితే.. వారిగురించి తెలియకపోవడం మరో రీజన్.

వారి గురించి తెలిసి కూడా మీరు నమ్మలేకపోతున్నారంటే.. ఆ వ్యక్తి గతంలో మీ నమ్మకాన్ని దెబ్బతీసి ఉండొచ్చు. లేదా ఆ వ్యక్తి ఇతరులతో వ్యవహరించే తీరు మీకు బాగా తెలిసి ఉండొచ్చు. లేదా వారు చేసే పనుల బట్టి.. వారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేరని మీరు భావించవచ్చు. దీనివల్ల మీరు వారిపై నమ్మకాన్ని పొందడం కష్టమవుతుంది. అసలు వారిపై జీవితంలో నమ్మకం రాకపోవచ్చు.

ఇంకొకటి వారి గురించి అస్సలు తెలియకపోవడం వల్ల కూడా మీకు వారిపై నమ్మకం రాకపోవచ్చు. కొందరు తమ లైఫ్​ని చాలా సీక్రెట్​గా మెయింటైన్ చేస్తారు. మీకు నమ్మకం కలిగేలా ఒక్కపని కూడా చేయకపోవచ్చు. తన గురించి నాకు ఏమి తెలియదు కదా.. తనని ఎలా నమ్మాలి అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. అందుకే మీకు వారిపై నమ్మకం రాకపోవచ్చు.

అయితే ఈ మొత్తంలో ఒకదానిలో నమ్మకం వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏంటంటే.. ఓ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినా కూడా మీకు నమ్మకం రావట్లేదంటే ఓ అర్థం ఉంది. కానీ ఓ వ్యక్తి గురించి ఏమి తెలియకుండా వారిపై నమ్మకం ఎలా ఉంచాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. వారితో కొంత సమయం ట్రావెల్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వారి గురించి మీకు తెలిసే అవకాశముంది. అప్పుడు మీరు వారిపై నమ్మకముంచుతారో.. లేదా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొందరు మీ నమ్మకం సంపాదించడం కోసం.. మీ ముందు నటిస్తారు. అలాంటివారిని కనుగొనడం కూడా చాలా ముఖ్యం. దానిలో మీరు ఎప్పుడూ విఫలం కాకుండా చూసుకోండి. ఎందుకంటే నమ్మకం ఒకసారి బ్రేక్​ అయితే.. దానిని అతికించడం చాలా కష్టం.

WhatsApp channel

సంబంధిత కథనం