Sabudana Khichdi। ముత్యమంటి ఆహారం, సుతిమెత్తని అల్పాహారం.. తింటే ఎంతో ఆరోగ్యకరం!-try sabudana khichid breakfast in the morning recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Try Sabudana Khichid Breakfast In The Morning, Recipe Inside

Sabudana Khichdi। ముత్యమంటి ఆహారం, సుతిమెత్తని అల్పాహారం.. తింటే ఎంతో ఆరోగ్యకరం!

HT Telugu Desk HT Telugu
Jun 20, 2022 08:18 AM IST

ఈ ఉదయ్తం సాబుదానా ఖిచ్డీతో అల్పాహారం చేయండి. శాఖాహార వంటకం, అలాగే ఎంతో ఆరోగ్యకరం, మహిళలకైతే మరీ మంచిది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది.

Sabudana Khchidi
Sabudana Khchidi (Unsplash)

ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన అల్పాహారం చేయాలని ఆలోచిస్తుంటే మీకు సబుదానా ఖిచ్డీ గొప్ప ఛాయిస్ గా ఉంటుంది. సబుదానా దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో ఏదో ఒక సందర్భంలో చేసుకునే ఒక వంటకం. దీనిని ఉపవాస సమయాల్లో స్వీకరించే సర్వోత్కృష్టమైన అల్పాహారంగా చెబుతారు. ఇందులో బలవర్థకమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్-ఫ్రీ ఇంకా డైరీ-ఫ్రీ ఆహారం. ఫ్లూ, జ్వరం లేదా మరేదైనా అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటే వారు సబుదానా ఖిచ్డీని తీసుకోవచ్చు

ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి కూడా సబుదానా ఎన్నో విధాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్‌ లేదా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరగకుండా నిరోధిస్తుంది.

సబుదానా ఖిచ్డీని ఉదయం పూట, అలాగే సాయంత్రం సమయంలో కూడా తీసుకోవచ్చు. కడిగిన ముత్యాలలో బంగాళదుంపలు, అక్కడక్కడ జీలకర్ర వేసినట్లు ఉండే ఈ అల్పాహారం చూస్తేనే నోరూరుతుంది. మరి ఇందులో నెయ్యి వేసి ఘుమఘుమలాడేలా చేసుకుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆ రెసిపీని మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాం. మీరూ ప్రయత్నించి చూడండి.

కావాల్సినవి

  • 1 కప్పు సబుదానా
  • 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి
  • 2 టీస్పూన్ జీలకర్ర
  • 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి
  • 2 బంగాళదుంపలు సన్నగా తరిగినవి
  • 1/2 కప్పు కాల్చిన వేరుశెనగ పొడి
  • 1 టీస్పూన్ చక్కెర
  • రుచికి తగినంత ఉప్పు

తయారీ విధానం

  1. కడాయిలో కొద్దిగా నెయ్యిని వేడి చేయండి.. నెయ్యి అందుబాటులో లేకపోతే నూనెను కూడా ఉపయోగించవచ్చు.
  2. నెయ్యి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలను వేయించండి.
  3. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి. కడాయిపై మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించండి. (లేదా ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను కలిపి కూడా చేసుకోవచ్చు).
  4. ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన సబుదానా, ఉప్పు, పంచదార, వేయించిన వేరుశెనగ పొడి వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఈ సాబుదానా పారదర్శకమయ్యే వరకు మూతపెట్టి సుమారు 5-7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి.

అంతే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు వేడివేడి సాబుదానా ఖిచ్డీ సిద్ధం అయినట్లే. ఖిచ్డీపై కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. దీనిని పెరుగుతో కలిపి తింటే ఆహా,ఓహో అంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం