Saregama Carvaan Mobile । సంగీత ప్రియుల కోసం సరిగమల ఫీచర్ ఫోన్.. ప్రత్యేకతలివే!-saregama carvaan mobile launched with 1500 preloaded songs check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saregama Carvaan Mobile । సంగీత ప్రియుల కోసం సరిగమల ఫీచర్ ఫోన్.. ప్రత్యేకతలివే!

Saregama Carvaan Mobile । సంగీత ప్రియుల కోసం సరిగమల ఫీచర్ ఫోన్.. ప్రత్యేకతలివే!

Manda Vikas HT Telugu
Sep 07, 2022 07:37 PM IST

మీరు సంగీత ప్రియులు, ఎర్రబటన్ పచ్చబటన్ ఉండే సాధారణ ఫీచర్ ఫోన్లను ఉపయోగించటానికి ఇష్టపడే సింపుల్ వ్యక్తులైతే మీ అభిరుచులకు తగినట్లుగా మార్కెట్లో Saregama Carvaan Mobile విడుదలైంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు చూడండి.

Saregama Carvaan Mobile
Saregama Carvaan Mobile

నేటి స్మార్ట్ కాలంలో కూడా మనకు ఫీచర్ ఫోన్‌లు అనగానే నోకియా ఫోన్‌లే గుర్తుకు వస్తాయి. మిగతా బ్రాండ్ల నుంచి కూడా మార్కెట్లో ఇప్పుడు ఫీచర్ ఫోన్‌లు ఉన్నప్పటికీ అవి అంతగా ప్రసిద్ధి చెందలేదు. అయితే ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ, తమ బ్రాండ్ నుంచి మొట్టమొదటి ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. Saregama Carvaan Mobile పేరుతో విడుదలైన ఈ ఫీచర్ ఫోన్‌లో ఏకంగా 1,500 ప్రీ-లోడ్ చేసిన పాటలతో అందిస్తోంది. ఇందులో ప్రేమగీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు ఇలా అనేక ప్లేలిస్టులను పొందుపరిచింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈ పాటలన్నీ వినవచ్చు, నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

ఈ ఫోన్‌లో ఇంకా వైర్‌లెస్ FM, డిజిటల్ కెమెరా, LED టార్చ్, AUX పోర్ట్, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్, వాయిస్ రికార్డింగ్, కాల్ రికార్డింగ్, డ్యూయల్-సిమ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త కార్వాన్ మొబైల్ స్క్రీన్ పరిమాణాల ఆధారంగా రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 2.4 అంగుళాలు డిస్‌ప్లే కలిగిన మోడల్ ధర రూ, రూ. 2490/- కాగా, 1.8 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చిన మోడల్ ధర రూ. రూ. 1990/- నిర్ణయించారు. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, క్లాసిక్ బ్లాక్, రాయల్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Saregama Carvaan Mobile ఫోన్ హైలైట్స్

- సరిగమ కార్వాన్ మొబైల్ ఫీచర్ ఫోన్ 2,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ దీర్ఘకాలికమైన టాక్-టైమ్‌ను అందించగలదు.

- సూపర్‌ఫాస్ట్ ప్రాసెసింగ్ పవర్ అందించే MediaTek ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.

- మరేతర ఫీచర్ ఫోన్లలో లేని విధంగా 2GB RAM, 32MB ఇంటర్నల్ స్టోరేజ్ డిఫాల్ట్ గా కలిగి ఉంది.

- డిజిటల్ కెమెరాతో పాటు ఫీచర్ ఫోన్లలో ఉండే మిగతా అన్ని ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోన్ హిందీ, తమిళం భాషలకు సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే మరిన్ని భారతీయ భారతీయ భాషలకు సపోర్ట్ చేసే హ్యాండ్ సెట్లను కంపెనీ విడుదల చేయనుంది. ఈ Saregama Carvaan Mobile ఇప్పుడు saregama.com, Amazon అలాగే Flipkart సహా ఇతర అన్ని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో, రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్