Puri Jagannath Temple: పూరి రథయాత్రకు ఎలా చేరుకోవాలి?-know how to reach puri jagannath temple for ratha yatra ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know How To Reach Puri Jagannath Temple For Ratha Yatra

Puri Jagannath Temple: పూరి రథయాత్రకు ఎలా చేరుకోవాలి?

HT Telugu Desk HT Telugu
Jun 05, 2023 12:13 PM IST

Puri Jagannath Temple: పూరి రథయాత్రకు ఎలా చేరుకోవాలో ఇక్కడ తెలుసుకోండి

పూరీ జగన్నాథ ఆలయం
పూరీ జగన్నాథ ఆలయం (PTI)

పూరీలోని జగన్నాథుని ఆలయం దేశంలోని పురాతన, ప్రసిద్ధ చెందిన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ జగన్నాథ రథయాత్ర ఏటా దేశ ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ ఏడాది జూన్ 20న పూరీ జగన్నాథ రథ యాత్ర జరగనుంది.

ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఒకవేళ మీరు ఈ రథయాత్ర చూసేందుకు పూరీ వెళ్లాలనుకుంటే అక్కడికి ఎలా చేరుకోవాలో ఈ కథనంలో తెలుసుకోండి.

పూరీ ఎలా చేరుకోవాలి?

పూరీ భువనేశ్వర్‌‌కు అతి సమీపంలో ఉంటుంది. భువనేశ్వర్‌కు విమాన, రైలు, బస్సు మార్గాల్లో చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఉంది.

విమానం ద్వారా

పూరీకి సమీపంలో 56 కి.మీ. దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయానికి అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

రైలు ద్వారా

పూరీ పట్టణంలో రైల్వే స్టేషన్ ఉంది. భువనేశ్వర్, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా సహా అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. పూరీ జగన్నాథ ఆలయం రైల్వే స్టేషన్‌కు 2 కి.మీ. దూరంలోనే ఉంది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌కు ఐదారు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, పూణే బీబీఎస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు నడుస్తాయి. సుమారు 20 నుంచి 22 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ. 550, థర్డ్ ఏసీ అయితే రూ. 1400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి తిరుపతి-పూరీ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది.

బస్సు ద్వారా

పూరీ చేరుకోవడానికి విశాఖపట్నం, భువనేశ్వర్, కటక్ వంటి నగరాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

WhatsApp channel

టాపిక్