Friday Motivation : చాలామందికి ఈజీగా కోపం వచ్చేస్తుంది. ఆ సమయంలో వాళ్లు ఎదుటివారి మాటలు వినరు. సరి కదా.. ఎదుటివారు ఎంతగా తమ ఫీలింగ్స్ చెప్తున్నా అర్థం చేసుకోరు. అర్థం చేసుకోగలిగే స్టేజ్లో వారు ఉండరు. ఎందుకంటే ఆ సమయంలో వారి మైండ్లో వారి కంట్రోల్లో ఉండదు. పూర్తిగా నెగిటివిటీ మాత్రమే ఉంటుంది కాబట్టి. అలాంటి పరిస్థితుల్లోనే మీరు ఉంటే కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా కూర్చుని.. పరిస్థితులపై ఓ అంచనాకు రండి.,ఎందుకంటే కొందరు కోపంలో ఏమి మాట్లాడుతారో వారికే తెలియదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా కుటుంబాల మధ్య చిచ్చును రగిలిస్తుంది. ఒక్కోసారి అది శాశ్వత దూరానికి తెరలేపుతుంది. అప్పటివరకు కంట్రోల్లో ఉండేవారు కోపంలో త్వరగా నోరు జారి ఎదుటివారిని హర్ట్ చేసేలా మాట్లాడుతారు. మీకు కోపం రావడం సహజమే. కానీ దానిని మీరు ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారనేది.. ఎలా కంట్రోల్ చేస్తున్నారనేదే మ్యాటర్.,ప్రతి వ్యక్తికి భావాలను వ్యక్తం చేసే ఫ్రీడం ఉంటుంది. కానీ.. దానిని ఏ సమయంలో ఎలా వివరిస్తున్నారు.. ఎలా చెప్పగలుగుతున్నారనేది ముఖ్యం. సాధారణంగా కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా మీకు నచ్చనట్లు మాట్లాడితేనో.. మిమ్మల్ని అనరాని మాటాలు అంటేనో.. లేదా అనవసరంగా మిమ్మల్ని బ్లేమ్ చేస్తేనో.. ఇలా చాలా కారణాల వల్ల మీకు కోపం రావొచ్చు. ప్రేమ రావడం ఎంత కామనో.. కోపం రావడం కూడా అంతే కామన్. కానీ ఆ సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారనేది మీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది.,మీకు నిజంగా పట్టరానంత కోపం వస్తే.. రెండు విషయాలు గురించి ఆలోచించండి. దేనికి రియాక్ట్ కావాలి? దేనికి రెస్పాండ్ కావాలి? ఈ రెండు విషయాలపై క్లారిటీ ఉంటే.. మీరు కచ్చితంగా ఈ కోపాన్ని అధిగమిస్తారు. కొన్నిసార్లు రియాక్ట్ అయితే చాలు.. రెస్పాండ్ కానవసరంలేదు. కొన్నిసార్లు రెస్పాండ్ కావొచ్చు. కానీ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మీరు రెస్పాండ్ అవుతారో.. రియాక్ట్ అవుతారనేది మీ పరిస్థితులపై, పూర్తిగా మీపై డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒకేసారి రెండు చేశారో.. అసలుకే మోసం వస్తుంది. కాబట్టి.. మీరు కోపంలో ఉన్నప్పుడు మీరు ఏది చేసినా.. చేయాలనుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కుదిరితే మౌనంగా ఉండండి. అది చాలా మంచిది. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మీకు మరింత సమయాన్ని ఇస్తుంది. అంతేకానీ ఆ హీట్ మూమెంట్లో మీరు కూడా అనరాని మాటలు అనేస్తే.. తర్వాత బాధపడాల్సి వస్తుంది.,