Midnight Eating: అర్ధరాత్రి తింటున్నారా.. ఈ ఇబ్బందులు తప్పవు!-eating late night have shocking side effects check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Eating Late Night Have Shocking Side Effects Check Details

Midnight Eating: అర్ధరాత్రి తింటున్నారా.. ఈ ఇబ్బందులు తప్పవు!

ప్రతీకాత్మక చిత్రం (Pixabay)
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

Midnight Eating: రాత్రిళ్లు ఆలస్యంగా ఆహారం తింటున్నారా.. అయితే దీని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇబ్బందులు తలెతుత్తుతాయి. ఆ వివరాలు ఇవే.

Midnight Eating: టీవీ చూస్తూనో, బయటకి వెళ్లడం కారణంగానో, పని లేట్ అవడం వల్లనో కొన్నిసార్లు ఆహారాన్ని అర్ధరాత్రి తింటుంటారు. కొందరు క్రమంగా రాత్రి లేట్‍గా డిన్నర్ చేస్తుంటారు. అయితే రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఎక్కువ కాలం ఇలాగే రాత్రిళ్లు ఆలస్యంగా తింటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి. అందుకే రాత్రిళ్లు ఆలస్యంగా తినకూడదని చాలా మంది నిపుణులు, డాక్టర్లు చెబుతూనే ఉంటారు. అర్ధరాత్రి ఆహారం తినడం వల్ల శరీరానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. జంక్ ఫుడ్ తింటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. రాత్రి లేట్‍గా ఆహారం తింటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

జీర్ణం అయ్యేందుకు కష్టమే..

రాత్రి వేళ్లలో ఆలస్యంగా ఆహారం తింటే యాసిడ్ రిఫ్లక్స్, హీట్ బర్న్ అయి ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, హార్మోన్లలో ఇంబ్యాలెన్స్ తలెత్తుతాయి. దీని వల్ల జీర్ణక్రియకు ఇబ్బందులు ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అవదు. రాత్రి లేట్‍గా తింటే శరీర జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అయితే సాయంత్రం 7 గంటలలోపే డిన్నర్ చేయడం మంచిది.

నిద్రకు ఇబ్బంది

రాత్రి ఆలస్యంగా ఆహారం తింటే నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. జీర్ణం సరిగా కాగా నిద్ర పట్టినా మెలకువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేట్‍గా తినే వారికి తికమక కలలు కూడా వస్తాయని గతంలో అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా రాత్రి ఆలస్యమయ్యాక స్నాక్స్ తింటే కడుపుకు మరింత ఇబ్బంది కలుగుతుంది. రాత్రి తిండికి, నిద్రకు మధ్య 2 గంటల గ్యాప్ ఉంటే మంచిదని నిపుణులు చూసిస్తున్నారు.

బరువు పెరిగే ప్రమాదం

అర్ధరాత్రి తినడం ఎక్కువ కాలం కొనసాగిస్తే శరీర బరువు పెరిగే రిస్క్ ఉంటుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని సర్కేడియన్ రిథమ్ ప్రభావితమవుతుంది. దీనివల్ల నిద్రకు ఇబ్బంది మాత్రమే కాకుండా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. రాత్రి వేళ్లలో శరీర జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే రాత్రి వేళ్లలో త్వరగా తినాలి.

బ్లడ్ ప్లజర్ ప్రమాదం

రాత్రివేళ ఆలస్యంగా తినే వారికి బ్లడ్ ప్లజర్, గుండె వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని చాలా అధ్యయనాలు తేల్చాయి. రాత్రి చాలా లేట్‍గా తినడానికి.. హైబ్లడ్ ప్లజర్, బ్లడ్ షుగర్

లెవెల్స్ అధికంగా ఉండడానికి లింక్ ఉందని పేర్కొన్నాయి.లేట్‍గా తినడం వల్ల జీర్ణం కాకపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల పరోక్షంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చిరాకుగా అనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది.