Lack of Sleep : మీలో మానవత్వం తగ్గిపోతుందా? అయితే ఇది కూడా ఓ కారణమే..-a new study revels lack of sleep can make you selfish here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  A New Study Revels Lack Of Sleep Can Make You Selfish Here Is The Details

Lack of Sleep : మీలో మానవత్వం తగ్గిపోతుందా? అయితే ఇది కూడా ఓ కారణమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 25, 2022 08:41 AM IST

Lack of Sleep : ఒక అధ్యయనం ప్రకారం రాత్రికి ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారు తోటివారి కంటే అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటారు. మానసిక ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. నిద్రలేమి మన సామాజిక మనస్సాక్షిని కూడా దెబ్బతీస్తుందని, ఇతరులకు సహాయం చేయాలనే కోరికను తగ్గిస్తుందని తాజా అధ్యయనం వెల్లడిస్తుంది.

నిద్రలేమి వల్ల స్వార్థం ఎక్కువ అవుతుందా?
నిద్రలేమి వల్ల స్వార్థం ఎక్కువ అవుతుందా?

Lack of Sleep : సరైన నిద్ర శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి వైద్యులు ఎల్లప్పుడూ 8 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు. లేదంటే నిద్రలేమి వల్ల హృదయ సంబంధ వ్యాధులు, డిప్రెషన్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి ప్రమాదకరమైన వాటి బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

కొత్తగా ఇప్పుడు నిద్రలేని రాత్రులు కూడా స్వార్థపూరిత ప్రవర్తనకు దారితీస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం.. నిద్ర లేకపోవడం మన ప్రాథమిక సామాజిక మనస్సాక్షి కూడా దెబ్బతింటుందని తేలింది. దీనివల్ల ఇతరులకు సహాయం చేయాలనే మన కోరికను, సుముఖతను మనం ఉపసంహరించుకుంటామని అధ్యయనం వెల్లడించింది.

1. పరిశోధకులు ఏమి కనుగొన్నారు?

పరిశోధకులు USలో ఈ 'స్వార్థపూరిత (Selfish)' ప్రభావాన్ని పరిశీలిస్తూ మూడు అధ్యయనాలు చేశారు. నాడీ కార్యకలాపాలు, ప్రవర్తనలో మార్పులను విశ్లేషించడం, ఇతరులకు ప్రయోజనం చేకూర్చడం. ఇవి- తక్కువగా నిద్రపోయే వారిలో చాలా తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

2. నిద్ర లేకపోవడం వల్ల బంధాలు ప్రభావితం అవుతాయా?

తగినంత నిద్ర లేకపోవడం ఒక వ్యక్తి మానసిక, శారీరక శ్రేయస్సుకు హాని కలుగుతుంది. అంతేకాకుండా వ్యక్తుల మధ్య బంధాలను, వారిమధ్య పరోపకార భావాలను కూడా దెబ్బతీస్తుందని కూడా అధ్యయనం సూచించింది.

3. ప్రజలు తక్కువ దానం చేస్తారట

కొత్త అధ్యయనంలో భాగంగా.. చాలా రాష్ట్రాల్లోని నివాసితులు తమ రోజులో ఒక గంట నిద్రను తగ్గించినప్పుడు.. దాతృత్వ దాతలు 10% తగ్గారని పరిశోధకులు కనుగొన్నారు. ఫుల్​గా పడుకున్న వారిలో ఈ తేడా లేదని తెలిపారు.

ఇది 2001, 2016 మధ్య యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన 3 మిలియన్ల దాతృత్వ విరాళాల డేటాబేస్‌ను మైనింగ్ చేసింది.

4. సామాజిక పరస్పర చర్యలను దిగజార్చుతుంది

నిద్రలేమి ఒక వ్యక్తి ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా.. వ్యక్తుల మధ్య సామాజిక పరస్పర చర్యలను, చివరికి మానవ సమాజం ఆకృతిని కూడా దిగజార్చుతుందని కొత్త పరిశోధన నిరూపిస్తుందని అధ్యయన పరిశోధకులలో ఒకరైన మాథ్యూ వాకర్ తెలిపారు.

"మనం సామాజికంగా ఎలా ఉంటామనేది.. మనకు ఎంత నిద్ర వస్తుంది అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది" అని మాథ్యూ వెల్లడించారు.

5. సహాయం చేయాలనే వ్యక్తుల సుముఖతను ఎలా ప్రభావితం చేస్తుందంటే..

ఎనిమిది గంటల నిద్ర తర్వాత, రాత్రి నిద్ర లేని తర్వాత.. ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజర్ (ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ)ని ఉపయోగించి 24 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్ల మెదడులను పరిశోధకులు స్కాన్ చేశారు.

నిద్రలేని రాత్రి తర్వాత.. మెదడులోని ప్రాంతాలు ఇతరులతో సానుభూతి చూపినప్పుడు లేదా ఇతరుల కోరికలు, అవసరాలను అర్థం చేసుకోవడంలో విఫలైమనట్లు కనుగొన్నారు. 8 గంటలు పడుకున్న వారు ఓపికగా వారి చెప్పింది అర్థం చేసుకున్నట్లు వెల్లడించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్