డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది-what fruit can you eat if you have diabetes this fruits that are good for diabetics ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Fruit Can You Eat If You Have Diabetes This Fruits That Are Good For Diabetics

డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది

HT Telugu Desk HT Telugu
May 27, 2022 01:21 PM IST

వేసవి కాలంలో చాలా మంది పుచ్చకాయలు తింటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అయితే డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయలో చక్కెరలు అధికంగా ఉంటాయని వాటిని తినకుండా ఉంటారు

Fruits
Fruits

మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటారు. మధుమేహం ఉన్నవారు పండ్లు, కూరగాయలు తినడం మంచిది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పండ్లలో ఎక్కువగా సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి వాటిని తినడం శ్రేయస్కారం. డయోబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో సమతుల్యత పాటించాలి.

ఇక వేసవి కాలంలో చాలా మంది పుచ్చకాయలు తింటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అయితే డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయలో చక్కెరలు అధికంగా ఉంటాయని వాటిని తినకుండా ఉంటారు. పండ్లు తినడంవల్ల జరిగే నష్టాలు కంటే వచ్చే లాభాలు ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పండ్లలో ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సీజన్‌లలో పండ్లను తినడం వల్ల ఎంతో ఆరోగ్యప్రదం కాబట్టి షుగర్ ఉన్నవారు రోజుకో పండు తింటే చాలా మంచిది.

డయాబెటిక్స్ ఉన్నవారు ఈ పండ్లు తీసుకుంటే మంచిది:

అవోకాడో

దానిమ్మపండు

నేరేడు పండు

నేరేడు పండు

చెర్రీస్

చెర్రీస్

ఆపిల్

పుచ్చకాయ

బొప్పాయి

స్ట్రాబెర్రీ

నారింజ

WhatsApp channel

టాపిక్