Farting । అపానవాయువు కాలుష్యంతో చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
Ayurvedic Tips For Farting: అపానవాయువును ఆపినా ఇబ్బందే, విడుదల చేసినా ఇబ్బందే. ఈ సంకట పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయుర్వేద చిట్కాలు చూడండి.
Farting: అపానవాయువు అంటే పిత్తు లేదా శ్రద్దు. దీనినే ఆయుర్వేదంలో అధో వాత అని పిలుస్తారు. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఒక సమస్య. తరచుగా అజీర్ణం లేదా మీరు తీసుకునే ఆహార పదార్థాల వలన ఉద్భవించే సమస్య. మనం ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు కొంత గాలిని కూడా మింగేస్తాము. ఈ గాలిలోని వాయువులు జీర్ణక్రియలో చర్యజరిగి కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువును మీరు విడుదల చేసినపుడు, ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన సాధారణంగా పీల్చడానికి ఇబ్బందిగా ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఎవరైనా విపరీతమైన అపానవాయువును విడుదల చేసినపుడు అది అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది సహజమైన శారీరక పనితీరులో భాగం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అపానవాయువును నిలుపుదల చేయడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, అలసట, జీవక్రియ మందగించడం, మలమూత్ర ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది.
Ayurvedic Tips For Farting- అపానవాయువుకు ఆయుర్వేద చిట్కాలు
ఆయుర్వేద వైద్యురాలు, వెల్నెస్ కోచ్ అయిన డాక్టర్ వరలక్ష్మి అపానవాయువు సమస్యను అధిగమించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు పంచుకున్నారు. అవి ఇక్కడ తెలుసుకోండి.
వాతను శాంతింపజేసే ఆహారం
మంచి పోషకాలు నిండిన ఆహారం, బాగా వండిన ఆహారంను వేడిగా ఉన్నప్పుడు తినండి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఎంచుకోండి. చల్లని ఆహారాలు, పచ్చిగా తినడం, పొడి లేదా కఠినమైన ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి.
వాము కలపండి
వాత దోషాన్ని తగ్గించడానికి మీ భోజనంలో చిటికెడు వాము పొడిని, నెయ్యి కలిపి వండండి. వాము విత్తనాలు మీ శరీరంలో చిక్కుకున్న గ్యాస్, కడుపు నొప్పుల నుండి ఉపశమనాన్ని అందించడంలో అత్యంత ప్రభావవంతమైనవి. మీరు భోజనం చేసిన తర్వాత లేదా ఎప్పుడైనా కడుపు ఉబ్బరం లేదా అపానవాయువును ఎదుర్కొంటున్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ వాము విత్తనాలు వేసి ఆ నీటిని తాగవచ్చు.
తక్కువ తినండి
అపానవాయువు సహజమే అయినప్పటికీ, మీరు అధికమొత్తంలో, ఎక్కువసార్లు అపానవాయువు విడుదల చేస్తున్నారంటే, అందుకు ఎక్కువ ఆహారాన్ని తినడం కూడా కారణం. మితంగా భోజనం చేయడం వలన మీ గ్యాస్ సమస్యను తగ్గించవచ్చు. అలాగే ఆహారాన్ని నెమ్మదిగా తినండి. చాలా త్వరగా తినడం లేదా తినేటప్పుడు మాట్లాడటం వలన మీరు గాలిని మింగడానికి ఆస్కారం ఉంటుంది, ఇది అదనపు గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది.
సుగంధ ద్రవ్యాలతో ఉడికించాలి
అధిక అపానవాయువు నుంచి ఉపశమనం కోసం రెండు రోజుల పాటు ఆహారంలో శొంఠిని కలుపుకొని తినండి. గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడటానికి ఇంగువ, జీలకర్ర వంటి జీర్ణ మసాలాలతో ఉడికించాలి. పప్పులను ముందుగా నానబెట్టడం వల్ల వాటి జీర్ణక్రియకు సహాయపడతాయి.
కదలండి
ఉన్నచోటునే కూర్చోవడం వలన గ్యాస్ పెరుగుతుంది. శరీరాన్ని కదిలించండి. రోజు నడకకు వెళ్ళడం, యోగా వంటి సున్నితమైన వ్యాయామాన్ని చేర్చడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రించడంలో, అదనపు గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.