Health Benefits with Buttermilk : చలికాలంలో మజ్జిగ తీసుకుంటే.. చక్కని ఆరోగ్యం మీదే..-5 reasons to include buttermilk in your diet buttermilk health benefits in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Reasons To Include Buttermilk In Your Diet Buttermilk Health Benefits In Winter

Health Benefits with Buttermilk : చలికాలంలో మజ్జిగ తీసుకుంటే.. చక్కని ఆరోగ్యం మీదే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 24, 2022 09:41 AM IST

Health Benefits with Buttermilk : చలికాలంలో మజ్జిగ తాగేందుకు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. తాగితే జలుబు, దగ్గు వస్తుందేమో అని భయపడతారు. కానీ వింటర్లో మజ్జిగ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో మజ్జిగ తీసుకుంటే..
చలికాలంలో మజ్జిగ తీసుకుంటే..

Health Benefits with Buttermilk : బటర్ మిల్క్​లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మజ్జిగ భారతదేశంలో ప్రియమైన పానీయంగా పిలువబడుతుంది. ధన, పేద తేడాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ.. అందరికీ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది మజ్జిగ. అయితే కొందరు మజ్జిగను చలికాలంలో తీసుకోకూడదని భావిస్తారు. మజ్జిగ చలువ చేసి.. జలుబు, దగ్గు వంటి వాటిని రప్పిస్తుందని అనుకుంటారు. అయితే మీరు కూడా ఆలోచిస్తే.. దానికి బ్రేక్ ఇవ్వండి. మజ్జిగను ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటుంది ఆయుర్వేదం. పైగా దాని వల్ల చలికాలంలో కూడా కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు.

ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవచ్చు అంటున్నాయి. వేసవిలో ఎక్కువగా వినియోగించే ఈ పానీయాన్ని.. చలికాలంలో కూడా తీసుకోవచ్చు అంటున్నారు. ఇది రుచికరమైనదే కాకుండా.. అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మీరు లాక్టోస్ అసహనంతో ఉన్నా, బరువు తగ్గడం గురించి ఆందోళన చెందుతున్నా.. అధిక రక్తపోటు గురించి ఇబ్బంది పడుతున్నా.. గ్లాసు మజ్జిగ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అంటున్నారు. చలికాలంలో మజ్జిగను తీసుకోవడం వల్ల మనం పొందగలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎసిడిటీని తగ్గిస్తుంది..

చలికాలంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల కడుపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మజ్జిగ ఎసిడిటీని తగ్గిస్తుంది. దీనిని పెరుగుతో తయారు చేస్తారు కాబట్టి.. ఇది కడుపులోని ఆమ్లతను తగ్గిస్తుంది. మీరు భోజనం తిన్న తర్వాత తరచుగా యాసిడ్ రిఫ్లక్స్‌ను అనుభవిస్తే మీరు మజ్జిగ తాగడం ప్రారంభించండి.

భోజనం చేసిన తర్వాత.. ఒక గ్లాసు మజ్జిగ తాగితే.. అది మీ జీర్ణక్రియకు హాయినిచ్చి.. ఎసిడిటీని తగ్గిస్తుంది. శొంఠి లేదా మిరియాలు వంటివి వేస్తే.. అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఇది యాసిడ్ రిఫ్లక్స్-సంబంధిత కడుపు లైనింగ్ చిరాకును తగ్గిస్తుంది.

మలబద్ధకాన్ని దూరం చేస్తుంది

మలబద్ధకం, దానికి సంబంధిత సమస్యలను నివారించడానికి మజ్జిగ మరొక సహజమైన చికిత్స. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా.. మజ్జిగ పేగు కదలికలకు సహాయపడుతుంది. అలాగే మీరు ప్రతిరోజూ తాగితే ఈ పరిస్థితిని పూర్తిగా తగ్గించుకోవచ్చు.

హైడ్రేట్​గా ఉండేందుకు..

మీ శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడానికి మజ్జిగ సహాయం చేస్తుంది. చలికాలంలో కూడా హైడ్రేట్​గా ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే చర్మ, జుట్టు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్.. అనారోగ్య సమస్యలను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా.. మజ్జిగ మీ శరీరంలో నీటిని కోల్పోకుండా ఆపుతుంది. దీనివల్ల మీరు సహజంగా మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవచ్చు.

కాల్షియం సమృద్ధిగా..

కాల్షియం కలిగన ఉత్తమ వనరులలో మజ్జిగ ఒకటి. చాలా మంది పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులను తినలేరు. ఎందుకంటే అవి లాక్టోస్ అసహనం కలిగిస్తాయి. అయితే మజ్జిగ.. లాక్టోస్ అసహనం తగ్గిస్తుంది. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు దీనివల్ల ఉండవు. కాబట్టి హ్యాపీగా కాల్షియం పొందవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

నిరంతరం మజ్జిగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. మజ్జిగ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా తగ్గిస్తుందో.. అనేక పరిశోధనలతో సైన్స్ కూడా దీనికి మద్దతునిచ్చింది.

WhatsApp channel