Cervical Spondylosis : మెడ నొప్పి నుంచి ఉపశమనం కావాలంటే ఈ ఆసనాలు వేసేయండి..
Yogasanas for Cervical Spondylosis : రోజువారీ కార్యకలాపాలు, పేలవమైన భంగిమ, ఆకస్మిక కదలికలు లేదా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా మంది సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతూ ఉంటారు. అయితే పలు యోగాసనాలతో దీనినుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.
Cervical Spondylosis : సర్వైకల్ స్పాండిలోసిస్‌తో మీరు బాధపడుతూ ఉన్నారా? అయితే మీరు దానినుంచి ఉపశమనం కోసం యోగాలోని పలు భంగిమలను ప్రయత్నించవచ్చు. దీనిని సులభమైన, సమర్థవంతమై యోగా ఆసనాలతో.. వదిలించుకోవచ్చు అంటున్నారు యోగానిపుణులు.
ట్రెండింగ్ వార్తలు
సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా సాధారణమైన పరిస్థితి. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. ఒకవేళ ప్రస్తుతం మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు కచ్చితంగా యోగాతో కొంత ఉపశమనం పొందవచ్చు. ఇంతకీ ఆ యోగాసనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భుజంగాసనం
మీ ముఖం కిందికి ఉంచి నేలపై పడుకోండి. మీ అరచేతులను మీ భుజాల పక్కన ఉంచండి. మీ కాళ్లను చాచి.. నెమ్మదిగా గాలి పీల్చండి. ఆపై మీ పైభాగాన్ని ఎత్తండి. మీ కాలి, పుబిస్ సరళ రేఖను ఏర్పరుచుకుని నేలను తాకినట్లు నిర్ధారించుకోండి.
ఈ ఆసనంలో 30 సెకన్ల పాటు ఉండండి. తర్వాత ఊపిరి వదులుతూ అసలు స్థితికి చేరుకోవాలి. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ నుంచి మీరు బయటపడటానికి సహాయపడుతుంది.
ధనురాసనం
నేలపై బోర్లా పడుకుని.. మీ కాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా, దూరంగా ఉంచండి. ఇప్పుడు మీ మోకాళ్లను వంచి, మీ పాదాలను గాలిలోకి పైకి లేపండి. మీ అరచేతులను ఉపయోగించి మీ చీలమండలను పట్టుకోండి. గట్టి పట్టును నిర్ధారించుకోండి.
మీ అవయవాలను వీలైనంత వరకు చాచి.. పైకి చూస్తూ.. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. శ్వాస సాధారణంగా ఉండేలా చూసుకోండి.
మత్స్యసనం
నేలపై పడుకుని.. లోటస్ భంగిమలో ఉన్నట్లుగా మీ కాళ్లను కలిపి ఉంచండి. మీ తల నేలపై ఉంచి.. మీ పైభాగాన్ని నెమ్మదిగా పైకి ఎత్తండి. ఒక వంపుని ఏర్పరుచుకోండి.
20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. పూర్తైన తర్వాత.. విశ్రాంతి తీసుకోండి. మీ వీపును బలోపేతం చేయడానికి, మెడను ఉత్తేజపరిచేందుకు ఇది ఒక అద్భుతమైన యోగా భంగిమ.
సేతు బంధాసనం
బోర్లా పడుకోండి. మీ మోకాళ్లను మడిచి, మీ పాదాలను హిప్ దగ్గరగా ఉంచండి. మీ చేతులు మీ శరీరం పక్కన కిందికి ఎదురుగా ఉంచండి. ఇప్పుడు మీరు గాలి పీల్చేటప్పుడు.. మీ మెడ, తల నేలపై విశ్రాంతి తీసుకునేలా మీ శరీరాన్ని తుంటి నుంచి నెమ్మదిగా పైకి ఎత్తండి.
మీ గడ్డం వైపు ఛాతీని ఎత్తండి. మీ చీలమండలను మీ చేతులతో పట్టుకోండి. శ్వాసను కొనసాగించండి. ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండండి.
మార్జారియాసనం
మీరు టేబుల్‌టాప్ స్థానంలో ఉండండి. మీ చేతులను నేరుగా మీ భుజాల కింద ఉంచండి. మీ మోకాళ్లను హిప్-వెడల్పు వేరుగా ఉంచండి.
నిటారుగా చూడండి. గాలి పీల్చుకుంటూ.. మీ గడ్డం పైకి లేపండి. మీ తలను వెనుకకు వంచండి. మీ వెన్నుముకను పైకి లేపి.. లోతైన శ్వాస తీసుకోండి. ఈ భంగిమలో కొన్ని సెకన్లు ఉండి.. యథాస్థానానికి వచ్చేయండి.
సంబంధిత కథనం