Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ - టిల్లన్న మ్యాజిక్ రిపీట్ - ఫుల్ ఫన్ గ్యారెంటీ
Tillu Square Twitter Review: డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లు స్వ్కేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించాడు.
Tillu Square Twitter Review: 2024లో యూత్ ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో టిల్లు స్వ్కేర్ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. 2022లో రిలీజై పెద్ద విజయాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?

టిల్లు ట్రేడ్ మార్క్ కామెడీ...
తన ట్రేడ్ మార్క్ కామెడీతో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్కేర్‌లోనూ అభిమానులను ఆకట్టుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ బాడీలాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ మరోసారి వర్కవుట్ అయ్యాయని చెబుతున్నారు. సిద్ధు వన్ మెన్ షోగా టిల్లు స్క్వేర్ మూవీ నిలిస్తుందని అంటున్నారు.
మ్యాజిక్ రిపీట్...
డీజే టిల్లులోని మ్యాజిక్ చాలా వరకు రిపీట్ అయ్యిందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఫుల్ ఫన్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచే మూవీ ఇదని అంటున్నారు. టిల్లు పక్కా బాక్సాఫీస్ విన్నర్ అని పేర్కొంటున్నారు.
సెకండాఫ్ యావరేజ్...
ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్దు తన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించాడని చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ ట్విస్ట్‌తోనే డైరెక్టర్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్ మాత్రం యావరేజ్‌గా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
కామెడీ డోసు తగ్గిందని ట్వీట్ చేశాడు. కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా కామెడీతో టైమ్‌పాస్ చేశారని చెబుతున్నారు. కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లు తరహాలో కోర్టు కామెడీ ట్రాక్‌లో సీక్వెల్ పడుంటే బాగుండేదని అంటున్నారు.
అనుపమ గ్లామర్ ట్రీట్...
టిల్లు స్వ్కేర్‌లో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. ఫైర్ బ్రాండ్‌లా అనుపమ ఈ మూవీలా కనిపిస్తుందని అంటున్నారు. లిల్లీ క్యారెక్టర్‌లో గ్లామర్ తో ట్రీట్ ఇచ్చిందని ట్వీట్లు చేస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని పేర్కొంటున్నారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి గెస్ట్‌గా కనిపించి ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. రాధిక మ్యాజిక్ మాత్రం సినిమాలో మిస్సయిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
65 కోట్ల కలెక్షన్స్...
హీరోగానే కాకుండా స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్‌గా సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్‌తో మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. భీమ్స్ బీజీఎమ్, పాటలు బాగున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద 60 నుంచి 65 కోట్లకుపైగా వసూళ్లను సాధించే సత్తా ఉన్న మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫుల్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ ఇదని చెబుతున్నారు.
టాపిక్