Amigos Pre Release Event: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్ - బింబిసార సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?-ntr to grace kalyanram amigos pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amigos Pre Release Event: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్ - బింబిసార సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?

Amigos Pre Release Event: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్ - బింబిసార సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?

Nelki Naresh Kumar HT Telugu
Feb 04, 2023 07:05 AM IST

Amigos Pre Release Event Guest:: క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 5న జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవ‌రు గెస్ట్‌గా రానున్నారంటే...

క‌ళ్యాణ్ రామ్
క‌ళ్యాణ్ రామ్

Amigos Pre Release Event Guest: క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న అమిగోస్ సినిమా ఫిబ్ర‌వ‌రి 10 రిలీజ్ కానుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్‌లో న‌టిస్తున్నాడు. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్ర‌వ‌రి 5న నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అగ్ర హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రుకాబోతున్నారు. క‌ళ్యాణ్ రామ్ గ‌త సినిమా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డంతో అదే సెంటిమెంట్‌ను అమిగోస్ సినిమాకు కొన‌సాగించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

శుక్ర‌వారం అమిగోస్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌లో మూడు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించారు క‌ల్యాణ్‌రామ్‌. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా, విలన్ గా రెండు షేడ్స్‌ల‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

అమిగోస్‌లో ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ళ్యాణ్ రామ్ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అమిగోస్ సినిమాను నిర్మిస్తోంది. బింబిసార స‌క్సెస్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇది. బింబిసార క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిల‌వ‌డంతో అమిగోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రిలీజ్ కు ముందే ఈ సినిమా లాభాల బాట ప‌ట్టిన‌ట్లు చెబుతున్నారు.

అమిగోస్ తో పాటు ప్ర‌స్తుతం డెవిల్ పేరుతో ఓ పీరియాడిక‌ల్ మూవీ చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్‌. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమాలో క‌ళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

IPL_Entry_Point