Nawazuddin Siddiqui : టాలీవుడ్‌లోకి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ.. 'సైంధవ్' సినిమాలోని లుక్ విడుదల-nawazuddin siddiqui first tollywood movie with victory venkatesh saindhav look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nawazuddin Siddiqui First Tollywood Movie With Victory Venkatesh Saindhav Look Released

Nawazuddin Siddiqui : టాలీవుడ్‌లోకి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ.. 'సైంధవ్' సినిమాలోని లుక్ విడుదల

Anand Sai HT Telugu
May 20, 2023 12:39 PM IST

Nawazuddin Siddiqui : బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అతని లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ
నవాజుద్దీన్ సిద్ధిఖీ (twitter)

పాన్ ఇండియా సినిమాల హైప్ పెరిగిన తర్వాత సౌత్ సినిమాలకు(South Cinema) బాలీవుడ్ నటుల సంఖ్య గతంలో కంటే చాలా ఎక్కువ పెరిగింది. ఇంతకుముందు కొంతమంది నటీమణులు మాత్రమే ఇక్కడికి వచ్చి ముఖం చూపించేవారు, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ నటులు కూడా దక్షిణాది సినిమాల్లో నటించడానికి క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నటులలో(Bollywood Actors) నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. విభిన్నమైన పాత్రల్లో రాణిస్తూ, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే సిద్ధిఖీ ఇప్పుడు తన రెండో సౌత్ ఇండియన్ సినిమాలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఓ తమిళ సినిమాలో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సైంధవ్'లో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. శైలేష్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా కనిపించనున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఖరీదైన కారు బానెట్‌పై కూర్చుని బీడీ తాగుతూ క్లాసీగా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కన్నడ నటి శ్రద్ధా నటిస్తోంది. డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్‌గా ఆండ్రియా జెరెమియా నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం S మణికందన్, ఎడిటింగ్ గ్యారీ BH చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా సైంధవ్(Saindhav) డిసెంబర్ 22న క్రిస్మస్ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

నవాజుద్దీన్ ఇంతకుముందు తమిళంలో రజినీకాంత్(Rajinikanth)తో పేట సినిమాలో నటించారు. బంగ్లాదేశ్ సినిమాలో కూడా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్‌లో అత్యంత బిజీ నటుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏడు సినిమాలున్నాయి. కంగనాతో నటించిన టీకు వెడ్స్ షేరు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా అవరాజ్, నూరానీ చెహ్రా, భోలే చుడియా, హడ్డీ, సంగీన్ వంటి సినిమాల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నారు. నవాజ్ మాత్రమే కాదు, సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా దక్షిణాది సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఇక్కడ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్