Bollywood Movies : సౌత్ సినిమాలాగే.. బాలీవుడ్‌లోనూ పండుగలకు పక్కా ప్లాన్ చేస్తున్నారా?-south movies shows to bollywood how to do festive releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  South Movies Shows To Bollywood How To Do Festive Releases

Bollywood Movies : సౌత్ సినిమాలాగే.. బాలీవుడ్‌లోనూ పండుగలకు పక్కా ప్లాన్ చేస్తున్నారా?

Anand Sai HT Telugu
Jan 20, 2023 09:42 AM IST

Bollywood Festival Release : సంక్రాంతికి విడుదలైన నాలుగు దక్షిణాది సినిమాలు.. ఒక్క వారంలో ఏకంగా రూ.638 కోట్లు వసూలు చేశాయి. కొన్నిరోజులుగా సౌత్ సినిమాలు ప్రపంచ స్థాయికి వెళ్తున్నాయి. ఇక పండగ అంటే.. దక్షిణాదిలో థియేటర్లో సినిమా ఉండాల్సిందే. మరి బాలీవుడ్ సంగతేంటి?

వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి
వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి

ఏ సినిమా పరిశ్రమకైనా పండగ వారాంతాలు బోనస్. అయితే బాలీవుడ్(Bollywood) లో మాత్రం.. కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. హిందీ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం దీపావళి(Deepavali), ఈద్ ను చూసుకుంటోంది. అయితే వసూళ్లపై మాత్రం.. ఇప్పటికీ భయంభయంగానే ఉన్నారు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు విడుదల పరంగా సంవత్సరంలో అతిపెద్ద పండగ సంక్రాంతి. ఏటా జనవరి రెండో వారంలో వచ్చే ఈ పండగ వారం రోజుల పాటు పెద్ద పెద్ద రిలీజులు ఉంటాయి. ఈ సంవత్సరం నాలుగు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. అన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.

మహమ్మారి తర్వాత దీపావళికి సైతం బాలీవుడ్‌(Bollywood)లో రిలీజ్ పై కాస్త ఆలోచిస్తున్నారట. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ కూడా గత కొంతకాలంగా ఈద్‌ సమయంలో తన డేట్‌ను ఫిక్స్ చేయడం లేదు. హిందీ చిత్ర పరిశ్రమ 2023లో పరిస్థితులను మార్చాలని చూస్తున్నందున, దక్షిణాది సినిమాలు సంక్రాంతిని.. మహమ్మారి తర్వాత ఎలా ఉపయోగించుకున్నాయో.. వారు గమనించవచ్చు.. దాని నుండి నేర్చుకోవచ్చు.

జనవరి 11న విడుదలైన రెండు తమిళ చిత్రాలు తలపతి విజయ్ వారిసు(Varisu), అజిత్ కుమార్ తునివు(Thunivu).. కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్స్ పెద్ద చిత్రాలు ఇవి. బుధవారం రాత్రి నాటికి, ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.373 కోట్లను రాబట్టాయి. అందులో ఒక్క తమిళనాడులోనే రూ.180 కోట్ల నికర వసూలు చేశాయి. కొన్ని రోజుల తర్వాత తెలుగు నుంచి నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 265 కోట్ల గ్రాస్‌ను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 206 కోట్ల నికర వసూళ్లను ఉన్నాయి.

ఈ భారీ విజయాన్ని సౌత్ సినిమాలు ఎలా సాధించాయి? ఇది సరైన విడుదల వ్యూహం, కంటెంట్ మీద ఆధారపడి ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. 'తునివు, వారిసు రెండూ బుధవారం విడుదలయ్యాయి. కాబట్టి, నటీనటుల అభిమానులు మొదటి మూడు రోజుల్లో సినిమాలను వీక్షించారు. ఆ తర్వాత వీకెండ్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌ రావడంతో సినిమాలు మంచి బిజినెస్‌ని కొనసాగించాయి. అయితే ఆ ఊపును నిలబెట్టుకోవాలంటే సినిమాలకు కంటెంట్ అవసరం. కంటెంట్ అంతా ఉంది. ఈ రెండు సినిమాలకూ యావరేజ్ రివ్యూలు వచ్చాయి. కానీ పండుగ విడుదలకు సరిపోతుంది.' ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ ఒకరు చెప్పారు.

జనవరి 11 నుంచి 15 వరకు ప్రతి రోజు ఈ నాలుగు సినిమాల నుంచి కనీసం రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. దీపావళి 2022 నాడు రెండు హిందీ పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. రామ్ సేతు, థాంక్ గాడ్ కలిపి తొలిరోజు రూ.23 కోట్లు వసూలు చేసింది. 2023 సంక్రాంతికి నాలుగు దక్షిణాది సినిమాలు(South Movies) వసూలు చేసిన రూ.638 కోట్లతో పోలిస్తే ఈ రెండు చిత్రాల ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం మొత్తం వసూళ్లు కేవలం రూ.90 కోట్లు మాత్రమే.

బాలీవుడ్ కంటెంట్ సెలక్షన్‌లో తప్పులు జరుగుతున్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. పండుగల సమయంలో ప్రధాన బలాలు ఏంటో చూసుకోవట్లేదని, వాటికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ప్రేక్షకులను చేరుకునేందుకు పండుగలలో తీసుకురావల్సిన కంటెంట్‌ను సృష్టించడం లేదని అభిప్రాయపడుతున్నారు. 'ప్రతి ఒక్కరికీ సినిమా ఓ వినోదం. అంతకుముందు దీపావళి పెద్ద రోజు. ఇప్పుడు మనకు స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ విడుదలలు మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ ఫెస్టివల్స్ అన్నీ ఫ్యామిలీ సినిమాలను వీక్షించడానికి ఉద్దేశించినవి కావు అనేది మేకర్స్‌ గుర్తించడం లేదు. పండుగల కోసం బాలీవుడ్ భారీ కంటెంట్‌ని ఎంచుకోవడం లేదు. పండుగల్లో పాటలు, నృత్యాలు, యాక్షన్, ఆరోగ్యకరమైన కామెడీని ప్రజలు చూడాలనుకుంటున్నారు.' అని ట్రేడ్ నిపుణుడు చెప్పారు.

అయితే వీటన్నింటి నుంచి హిందీ చిత్ర పరిశ్రమకు గుణపాఠం ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. తెలుగు, తమిళం పరిశ్రమలు పండుగ వారాంతంలో ఎలా తిరిగి పుంజుకున్నాయో.. చూసిన తర్వాత బాలీవుడ్ ఆ టెంప్లేట్‌ను అనుసరించవచ్చు. గతంలో మాదిరిగా పండుగలకు విడుదలలు పెట్టుకోవాలని బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

1990ల మధ్య కాలం నుండి దీపావళికి విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు ఉన్నాయి. దిల్‌వాలే దుల్హనీ లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై నుండి వీర్ జారా, ప్రేమ్ రతన్ ధన్ పాయో వరకు పండగలకు విడుదలైన సినిమాలే. ఈ సంవత్సరం దీపావళికి సంబంధించి విడుదలయ్యే.. ఒక పెద్ద సినిమా సల్మాన్ ఖాన్ టైగర్ 3. అది బాలీవుడ్ దీపావళి సంబరాలను పునరుద్ధరించగలదా? కాలమే చెప్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం