Liger Kalalo Kuda Music Video: లైగర్ నుంచి 'కలలో కూడా..' సాంగ్‌ రిలీజ్‌-liger kalalo kuda music video released by the makers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Kalalo Kuda Music Video: లైగర్ నుంచి 'కలలో కూడా..' సాంగ్‌ రిలీజ్‌

Liger Kalalo Kuda Music Video: లైగర్ నుంచి 'కలలో కూడా..' సాంగ్‌ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu

Liger Kalalo Kuda Music Video: లైగర్ మూవీ నుంచి కొత్త సాంగ్‌ కలలో కూడా మ్యూజిక్‌ వీడియో రిలీజైంది. ఈ సాంగ్‌ను మంగళవారం (ఆగస్ట్‌ 30) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

లైగర్ మూవీలోని కలలో కూడా సాంగ్ లో విజయ్, అనన్య (Youtube Grab)

Liger Kalalo Kuda Music Video: లైగర్‌ మూవీ ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలుసు కదా. ఈ సినిమాకు తొలి రోజే దారుణమైన నెగటివ్‌ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు పడిపోయాయి. దీనికితోడు ఫ్యాన్స్ కూడా మూవీని ట్రోల్‌ చేస్తున్నారు. పూరితో మరో సినిమా తీయొద్దు అని విజయ్‌ దేవరకొండకు సలహా కూడా ఇస్తున్నారు.

ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు. దీంతో టాలీవుడ్‌లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోనుంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్‌ కలలో కూడా అనే సాంగ్‌ మ్యూజిక్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ రొమాంటిక్‌ సాంగ్‌లో విజయ్‌, అనన్య మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే లైగర్‌ నుంచి మూవీ రిలీజ్‌కు ముందు అకిడి పకిడి, వాట్‌ లగా దేంగే, ఆఫత్‌, కోకా 2.0లాంటి సాంగ్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.

నిజానికి లైగర్‌కు నెగటివ్‌ టాక్ వచ్చినా.. విజయ్‌ యాక్టింగ్‌కు మాత్రం పాజిటివ్‌ మార్కులే వచ్చాయి. సినిమా కోసం అతడు బాగానే కష్టపడ్డాడని, తన పర్సనాలిటీని మొత్తంగా మార్చుకోవడంతోపాటు స్క్రీన్‌పైనా అదరగొట్టాడని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించిన విజయ్‌.. తన రోల్‌ బాగానే చేసినా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలోనే లైగర్‌ బోల్తా పడింది.

చివరికి లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ను అతిథి పాత్రలో తీసుకొచ్చినా వర్కవుట్‌ కాలేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు హిందీలోనూ లైగర్‌ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మూవీ రిలీజ్‌కు ముందు బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై విజయ్‌ చేసిన కామెంట్స్‌ కూడా హిందీ బెల్ట్‌లో లైగర్‌పై ప్రభావం చూపినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంలో విజయ్‌ను తిట్టిన ముంబైలోని మరాఠా మందిర్‌ థియేటర్‌ ఓనర్‌ మనోజ్‌ దేశాయ్‌ను కూడా అతడు కలిశాడు.

సంబంధిత కథనం