Cobra Movie Craze: కోబ్రా మూవీ చూడాలి.. హాలీడే ప్రకటించండి: స్టూడెంట్స్ డిమాండ్-cobra movie craze peaks as students from a college demand holiday on release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cobra Movie Craze: కోబ్రా మూవీ చూడాలి.. హాలీడే ప్రకటించండి: స్టూడెంట్స్ డిమాండ్

Cobra Movie Craze: కోబ్రా మూవీ చూడాలి.. హాలీడే ప్రకటించండి: స్టూడెంట్స్ డిమాండ్

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 08:57 PM IST

Cobra Movie Craze: కోబ్రా మూవీ చూడాలి.. హాలీడే ప్రకటించండి అంటూ స్టూడెంట్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. వాళ్లు ఓ లీవ్‌ లెటర్‌ కూడా రాశారు. ఇంతకీ ఎవరు వాళ్లు?

కోబ్రా మూవీలో విక్రమ్
కోబ్రా మూవీలో విక్రమ్ (Twitter)

Cobra Movie Craze: తమిళ సూపర్‌స్టార్‌ చియాన్‌ విక్రమ్‌ నటించిన కోబ్రా మూవీ ఈ బుధవారం (ఆగస్ట్‌ 31) రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా బజ్‌ మామూలుగా లేదు. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఈ సినిమాకు ఓ రేంజ్‌లో హైప్‌ ఉంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మూవీ ట్రైలర్‌ కూడా వాళ్లలో సినిమాపై అంచనాలు పెంచేసింది.

అయితే ఈ సినిమాకు ఎంత క్రేజ్‌ ఉందో తాజాగా జరిగిన ఓ ఘటన అద్దం పట్టింది. ఓ కాలేజీకి చెందిన ఇద్దరు స్టూడెంట్స్‌ సినిమా చూడటానికి ఏకంగా లీవ్‌ ఇవ్వమంటూ ప్రిన్సిపల్‌కు లెటర్‌ రాయడం వైరల్‌గా మారింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న సెయింట్ జోసెఫ్‌ కాలేజీకి చెందిన స్టూడెంట్స్‌ ఈ లెటర్‌ రాశారు. ఇప్పుడీ లెటర్‌ సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

"గౌరవనీయులైన ప్రిన్సిపల్‌ గారికి, మేము కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్టూడెంట్స్. కోబ్రా మూవీ రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా సెప్టెంబర్‌ 1న కాలేజీకి అధికారికంగా హాలీడే ప్రకటించండి. ఆగస్ట్‌ 31న టికెట్లు అందుబాటులో లేవు. దయచేసి ఎలాంటి కాల్స్‌ లేదా మెసేజ్‌లు చేయొద్దని కోరుతున్నాం. ఎలాగూ ఆ రోజు మేము కాలేజీకి రావడం లేదు. థ్యాంక్యూ. ఇట్లు చియాన్‌ ఫ్యాన్స్‌" అంటూ ఆ లెటర్‌లో రాశారు.

చియాన్‌ విక్రమ్‌కు తమిళనాడులో ఉన్న క్రేజ్‌కు ఈ లెటరే నిదర్శనం. అతడు నటించిన ఈ కోబ్రా మూవీని అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమాలో ఫిమేల్‌ లీడ్‌లో కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నటించింది. మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ సినిమాతో తన యాక్టింగ్‌ కెరీర్‌ ప్రారంభించడం విశేషం. ఈ సస్పెన్స్‌ డ్రామాలో ఇర్ఫాన్‌ విలన్‌ రోల్‌లో కనిపించనున్నాడు.

ఈ కోబ్రా మూవీ తర్వాత చియాన్‌ విక్రమ్‌.. మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న హిస్టారికల్‌ మూవీ పొన్నియిన్‌ సెల్వన్‌లోనూ నటిస్తున్నాడు. ఇందులో ఆదిత్య కారికేళన్‌ పాత్రను విక్రమ్‌ పోషిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ కానుంది.

IPL_Entry_Point