SRH vs RCB : ‘ప్రతి మ్యాచ్​ గెలవలేము’- హైదరాబాద్​ జట్టుకు ప్యాట్​ కమిన్స్​ మోటివేషన్​..-rcb vs srh ipl 2024 pat cummins motivational words after loss ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Rcb : ‘ప్రతి మ్యాచ్​ గెలవలేము’- హైదరాబాద్​ జట్టుకు ప్యాట్​ కమిన్స్​ మోటివేషన్​..

SRH vs RCB : ‘ప్రతి మ్యాచ్​ గెలవలేము’- హైదరాబాద్​ జట్టుకు ప్యాట్​ కమిన్స్​ మోటివేషన్​..

Sharath Chitturi HT Telugu
Apr 26, 2024 08:49 AM IST

SRH vs RCB : ఐపీఎల్​ 2024లో హార్డ్​ హిట్టింగ్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​పై ఆర్సీబీ గెలిచింది. మ్యాచ్​ అనంతరం.. తన జట్టును మోటివేట్​ చేశాడు హైదరాబాద్​ కెప్టెన్​ ప్యాట్​ కమిన్స్​.

సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ ప్యాట్​ కమిన్స్​..
సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ ప్యాట్​ కమిన్స్​..

SRH vs RCB IPL 2024 : ఐపీఎల్​ 2024లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులపై అనూహ్య ఓటమితో సన్​ రైజర్స్​ హైదరాబాద్​ ఫ్యాన్స్​ షాక్​లో ఉన్నారు. ఉప్పల్​ వేదికగా.. ఏప్రిల్ 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ నేపథ్యంలో జట్టును మోటివేట్​ చేశాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్.

"ఈ రోజు మనది కాదు. బౌలింగ్​లో కొన్ని రన్స్​ ఎక్కువగా ఇచ్చాము. దురదృష్టవశాత్తూ బ్యాటింగ్​​ అంతటా కొన్ని వికెట్లు కోల్పోయాం. అటాకింగ్​ స్టైల్​.. మన బలం అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రతి మ్యాచ్​లో పని చేయదు. ఒకట్రెండు మ్యాచ్​ల్లో ఆరంభంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. మంచి స్కోర్ సాధించగలిగాం. ఇప్పటికీ మా కుర్రాళ్లకు ఇదే మార్గమని అనుకుంటున్నాం' అని మ్యాచ్ అనంతరం కమిన్స్ అన్నాడు.

'సన్​ రైజర్స్​ హైదరాబాద్​ కుర్రాళ్లు చాలా బాగా ఆడుతున్నారు. ఇది టీ20 క్రికెట్. మనం ప్రతి మ్యాచ్ గెలవలేము. దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టకండి," అని టీమ్​ని మోటివేట్​ చేశాడు ప్యాట్​ కమిన్స్​.

SRH vs RCB highlights : ఈ ఐపీఎల్​ 2024లో సన్​రైజర్స్ హైదరాబాద్ విజయానికి దోహదపడిన కీలక అంశాల్లో ఒకటి.. మొదట బ్యాటింగ్ చేసి రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేయడం. ఈ సీజన్​లో రెండుసార్లు.. ఐపీఎల్​ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. కానీ ఈసారి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ తీసుకున్నాడు.

'మేం మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము. అది మాకు బాగా పనిచేస్తోంది. గత కొన్ని విజయాలకు ముందు మాది బౌలింగ్ ఫస్ట్ జట్టు అని అనుకున్నాం. కానీ అలా జరగలేదు,' అని కమిన్స్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ అనంతరం ఏప్రిల్ 28న చెన్నై సూపర్ కింగ్స్​తో సన్​రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

ఆర్సీబీ వర్సెస్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​..

IPL 2024 latest news : ఈ మ్యాచ్​లో ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ 20 బంతుల్లో 5 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆర్సీబీ సన్​రైజర్స్ హైదరాబాద్​కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టోర్నీలో అత్యంత బలహీనమైన బౌలింగ్ అటాక్​గా బరిలోకి ఆర్సీబీపై హైదరాబాద్​ గెలవలేకపోయింది. హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 171 (20 ఓవర్లు) పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ కేవలం ఒక్క పరుగుకే ఔట్​ అవ్వగా.. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేసి శుభారంభం అందించాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ టాప్ ఆర్డర్ ఐడెన్ మార్క్రమ్ 7 పరుగుల వద్ద ఔటవ్వగా, హార్డ్ హిట్టింగ్ హెన్రిచ్ క్లాసెన్ కూడా అదే స్కోరుకు పడిపోయాడు. పార్ట్ టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ మూడు ఓవర్లలో 2/40తో రాణించాడు.

ఈ మ్యాచ్​లో ఓటమితో హైదరాబాద్ 10 పాయింట్లతో కోల్​కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్​తో సమానంగా నిలిచింది. ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో మూడో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం