Cars launch in April 2023 : ఏప్రిల్​లో లాంచ్​ కానున్న కార్స్​ లిస్ట్​ ఇదే..-check out the list of cars that are ready to launch in april 2023 in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Check Out The List Of Cars That Are Ready To Launch In April 2023 In India

Cars launch in April 2023 : ఏప్రిల్​లో లాంచ్​ కానున్న కార్స్​ లిస్ట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Mar 24, 2023 02:17 PM IST

Cars launch in April 2023 : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​తో పాటు మరికొన్ని వాహనాలు ఏప్రిల్​లో లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు..

ఏప్రిల్​లో లాంచ్​ కానున్న కార్స్​ లిస్ట్​ ఇదే..
ఏప్రిల్​లో లాంచ్​ కానున్న కార్స్​ లిస్ట్​ ఇదే..

Cars launch in April 2023 : కొత్త కొత్త లాంచ్​లతో ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​ ఇటీవలి కాలంలో కళకళలాడిపోతోంది. ఏప్రిల్​ నెలలో సైతం పలు కొత్త వాహనాలు లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..

2023 ఆటో ఎక్స్​పోలో ఫ్రాంక్స్​ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్​కు బుకింగ్స్​ పరంగా మంచి డిమాండ్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీని ఫ్రెంట్​ ఫేస్​.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాను పోలి ఉంటుంది. కాగా.. బ్రెజా​తో పోల్చుకుంటే దీని సైజు తక్కువగా ఉంది. టాటా పంచ్​, నిస్సాన్​ మాగ్నైట్​ వంటి వాహనాలకు ఈ ఫ్రాంక్స్​ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Maruti Suzuki Fronx price in India : ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో 1.0 లీటర్​ కే సిరీస్​ టర్బో బూస్టర్​జెట్​ ఇంజిన్​ ఉంటుంది. స్మార్ట్​ హైబ్రీడ్​ టెక్నాలజీ దీని సొంతం. 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.​ ఏప్రిల్​ మధ్యలో ఈ కారు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

ఎంజీ కామెట్​ ఈవీ..

కామెట్​ ఈవీని వాస్తవానికి ఆటో ఎక్స్​పోలో ఎంజీ మోటార్​ లాంచ్​ చేయాల్సి ఉంది. కానీ పోస్ట్​పోన్​ చేసింది. దీనిని ఏప్రిల్​ చివర్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఎంజీ మోటార్​ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఈ కామెట్​ ఈవీ. మొదటిది జెడ్​ఎస్​ ఈవీ. సైజు పరంగా ఈ కామెట్​ ఈవీ చాలా చిన్నది. లాంచ్​అనంతరం ఇండియాలో అతి చిన్న ఈవీగా ఇది నిలువనుంది.

MG Comet EV India launch : ఈ ఎంజీ కామెట్​ ఈవీకి సంబంధించిన బ్యాటరీ ప్యాక్​, ఎలక్ట్రిక్​ మోటార్​ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే.. ఇందులో 20కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 250-300 కి.మీల దూరం ఇది ప్రయాణిస్తుందని తెలుస్తోంది.

మెర్సిడెస్​ ఏఎంజీ జీటీ 63 ఎస్​ ఈ పర్ఫార్మెన్స్​..

Mercedes-AMG GT 63 S E Performance price : ఏప్రిల్​లో లాంచ్​ అవుతున్న లగ్జరీ కార్లలో ఈ మెర్సిడెస్​ ఏఎంజీ జీటీ 63 ఎస్​ ఈ పర్ఫార్మెన్స్​ ఒకటి. ఏప్రిల్​ 11 ఇది ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఫార్ములా వన్​ స్ఫూర్తితో దీనిని రూపొందించారు. ఇందులో 4.0 లీటర్​ వీ8 టర్బో ఇంజిన్​- ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. ఏఎంజీ కార్లలో ఇదే ది మోస్ట్​ పవర్​ఫుల్​ మోడల్​!

ఈ ఇంజిన్​.. 843 హెచ్​పీ పవర్​ను, 1400 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ను అందుకోవడానికి కేవలం 2.9సెకన్లే పడుతుండటం విశేషం. దీని టాప్​ స్పీడ్​ 316 కేఎంపీహెచ్​.

లంబోర్ఘిని ఉరుస్​ ఎస్​..

Lamborghini Urus S India launch news : లంబోర్ఘిని ఉరుస్​ ఎస్​.. గతేడాది సెప్టెంబర్​లో అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఇక ఇప్పుడు.. ఈ లగ్జరీ ఎస్​యూవీ భారత్​ మార్కెట్​లోకి ఏప్రిల్​ 11న అండుగుపెట్టనుంది. లంబోర్ఘినికి ఇది ఎంట్రీ లెవల్​ మోడల్​గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 4.0 లీటర్​ వీ8 ఇంజిన్​ ఉంటుంది. ఇది 666 హెచ్​పీ పవర్​ను, 850 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని టాప్​ స్పీడ్​ 305 కేఎంపీహెచ్​. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 3.5 సెకన్లలో అందుకుంటుంది.

ధరలు కూడా పెరగనున్నాయి..

ఏప్రిల్​లో కార్ల లాంచ్​లతో పాటు అనేక వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, నిస్సాన్​, హ్యుందాయ్​తో పాటు అనేక సంస్థల మోడల్స్​ ధరలు ఏప్రిల్​ 1 నుంచి పెరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం