తెలుగు న్యూస్ / ఫోటో /
Audi Urbansphere | ఆడీ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్.. లగ్జరీకి ఎలాంటి లోటు లేదు!
- లగ్జరీ కార్ ఆరోమేకర్ ఆడీ సరికొత్త అర్బన్‌స్పియర్ ఎలక్ట్రిక్ మినీవ్యాన్‌ను ఆవిష్కరించింది. ట్రాఫిక్ రద్దీ ఉండే సిటీలలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ టెక్నాలజీని పరిచయం చేసింది.
- లగ్జరీ కార్ ఆరోమేకర్ ఆడీ సరికొత్త అర్బన్‌స్పియర్ ఎలక్ట్రిక్ మినీవ్యాన్‌ను ఆవిష్కరించింది. ట్రాఫిక్ రద్దీ ఉండే సిటీలలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ టెక్నాలజీని పరిచయం చేసింది.
(1 / 8)
ఎంతో ఆసక్తిని రేకెత్తించిన అటానమస్ కాన్సెప్ట్ వాహనం అర్బన్‌స్పియర్ కారును ఆడి ఆవిష్కరించింది. ఇరుకైన ట్రాఫిక్ ఉండే చైనీస్ మెగాసిటీలలో వినియోగించటానికి ఆడి అర్బన్‌స్పియర్‌ను రూపొందించారు. ఇది ప్రపంచంలోని ఏ ఇతర మెట్రోపాలిటన్ సిటీకైనా అనుకూలంగా ఉంటుంది.(Audi)
(2 / 8)
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎలక్ట్రిక్ మినీవ్యాన్‌గా దీనిని రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ మినీవ్యాన్ రూపకల్పన కోసం సింప్లిసిటీ సూత్రాన్ని అనుసరించారు. ఈ కారు పొడవు 5.5 మీటర్లు, ఎత్తు దాదాపు 1.78 మీటర్లు, వెడల్పు రెండు మీటర్లు.(Audi)
(3 / 8)
ఆడీ అర్బన్‌స్పియర్ ముందు భాగంలో ఒకే ఫ్రేమ్‌గా వస్తుంది, ఇది కాన్సెప్ట్ EVకి కచ్చితమైన రూపాన్ని ఇస్తుంది. సింగిల్‌ఫ్రేమ్ ఉపరితలం ఆడి లైట్ కాన్వాస్‌గా మారుతుంది. రహదారి భద్రత విషయంలో రాజీ లేకుండా స్పష్టంగా సంకేతాన్ని అందించే డైనమిక్ లైటింగ్ ఇచ్చారు.(Audi)
(4 / 8)
ఆడీ అర్బన్‌స్పియర్ భారం మొత్తాన్ని 24-అంగుళాల డబుల్-స్పోక్ వీల్స్ మోస్తాయి. ముందు భాగంలో సింగిల్‌ఫ్రేమ్‌తో పాటు బాడీలో ఇమిడిన డిజిటల్ లైట్లు, డైనమిక్ రూఫ్ ఆర్చ్, బ్యాటరీ యూనిట్‌ను దాచిపెట్టే భారీ రాకర్ ప్యానెల్ ఈ కారుకు ఒక హుందాతనాన్ని ఇచ్చాయి.(Audi)
(5 / 8)
ముందు భాగంలో ఉన్నట్లుగానే ఆడి అర్బన్‌స్పియర్ వెనుక భాగంలో కూడా LED మ్యాట్రిక్స్ సర్ఫేస్ ఫీచర్లు ఉన్నాయి.(Audi)
(6 / 8)
ఆడీ అర్బన్‌స్పియర్ కారులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మొత్తం 295 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే 690 Nm గరిష్ట టార్క్‌ను అందించగలవు. కాన్సెప్ట్ EVలో ముందు ఒకటి, వెనుక ఒక ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఎలక్ట్రానిక్ కోఆర్డినేషన్ వ్యవస్థ ద్వారా ఇది ఆల్-వీల్-డ్రైవ్‌గా పనిచేస్తుంది. అంటే ఈ కారు అన్ని చక్రాలకు పవర్ సప్లై జరుగుతుంది.(Audi)
(7 / 8)
ఆడీ అర్బన్‌స్పియర్ EV తయారీలో అత్యంత నాణ్యమైన మెటీరియల్‌ను ఉపయోగించారు. ప్రయాణీకుల కంఫర్ట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కంపెనీ హామీ ఇచ్చింది. ప్యానలింగ్, సీట్ కవరింగ్‌లు, ఫ్లోర్ కార్పెట్‌లలో మంచి నాణ్యత గల కలప, ఉన్ని ఇంకా నునుపైన సింథటిక్ గుడ్డలను ఉపయోగించారు.(Audi)
(8 / 8)
ఈ కాన్సెప్ట్ EV లోపల నాలుగు సీట్లు ఉన్నాయి. ఇవి రెండు వరుసలలో ఉంటాయి. వెనుక సీట్ల సర్దుబాటు కోసం ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి. రిలాక్స్, ఎంటర్‌టైన్, బ్యాక్‌రెస్ట్ మోడ్‌లలో కూర్చోవచ్చు. 60 డిగ్రీల వరకు సీట్లు వంగుతాయి. అదే సమయంలో లెగ్ రెస్ట్‌లు విస్తరణ చెందుతాయి. సెంటర్-మౌంటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, సీట్లు ఇంకా డోర్‌లలో ఉన్న భద్రతా ఆప్షన్లు ప్రయాణికులకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి.(Audi)
ఇతర గ్యాలరీలు