Lokesh Padayatra Updates: నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో పూర్తికాగా.... సాయంత్రం ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఇక చితూరు జిల్లాలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మొలకలచెరువు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన లోకేశ్... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో జగన్ సర్కార్ కు గట్టి బుద్ధిచెప్పారని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ ఉంటున్న ప్యాలెస్ కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు.,గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాలను గెలిచిందని లోకేశ్ అన్నారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం ఈ ఫలితాలతో అర్థమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో మార్పునకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శ్రీకారం చుట్టాలని తాము ప్రజలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ ఓటుతో ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారని చెప్పారు. మొదట అభ్యర్థులను, తర్వాత ఓటర్లను వైసీపీ నేతలు ప్రలోభపెట్టారని లోకేశ్ ఆరోపించారు. చివరికి దొంగ ఓట్లు సృష్టించి... 6,7వ తరగతి చదివిన వాళ్లతో పట్టభద్రుల ఓట్లను వేయించారని ఆగ్రగం వ్యక్తం చేశారు. కానీ డబ్బు బలం, అధికార బలం, అవినీతి బలం... ఏవీ కూడా ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయాయని చెప్పుకొచ్చారు. జగన్ మీదున్న అసంతృప్తిని చల్లార్చ లేకపోయాయంటూ కామెంట్స్ చేశారు.,లోకేశ్ కు ఘన స్వాగతం...ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో 577 కిలోమీటర్ల పాటు లోకేశ్ పాదయాత్ర పూర్తి చేశారు. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ కు చీకటిమానిపల్లి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన లోకేశ్... వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.,మరోవైపు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆ పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లోక్కింపు పూర్తయ్యింది. మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు 27315 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అభ్యర్థి విజయానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 94,509 ఓట్లు పొందాల్సి ఉండగా.. చిరంజీవిరావుకు 82,958 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి సుధాకర్‌కు 55,749 ఓట్లు పోలయ్యాయి. తుది ఫలితం కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 27,262 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 50శాతం ఓట్లు దాటక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల(పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది.,