Lokesh Padayatra: 44వరోజు లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర
Lokesh Yuvagalam Padayatra Updates:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాదయాత్ర కొనసాగుతోంది. 44వ రోజు తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలో సాగుతోంది. పలువర్గాల సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్... ముందుకుసాగుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా మద్దయ్యగారిపల్లిలో యువతతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. మరోవైపు లోకేశ్ పాదయాత్రకు పలు సంఘాలు మద్దతు పలికాయి.
(1 / 6)
జగన్ పాలనలో వచ్చిన ఒక్క పరిశ్రమనైనా చూపించాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు నారా లోకేశ్. గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందంటూ కామెంట్స్ చేశారు.(twitter)
(2 / 6)
తంబళ్లపల్లెను మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోందని నారా లోకేశ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.(twitter)
(3 / 6)
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని లోకేశ్ ప్రకటించారు. ఇక లోకేశ్ పాదయాత్రకు న్యాయవాదులు మద్దతు పలికారు.(twitter)
(4 / 6)
జాబ్ క్యాలెండర్ పేరిట సీఎం జగన్ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు లోకేశ్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర యువత ఎక్కువ నష్టపోయిందని వ్యాఖ్యానించారు. (twitter)
ఇతర గ్యాలరీలు