CM YS Jagan: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధం-ap govt key decision on ban of plastic flexis in state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Key Decision On Ban Of Plastic Flexis In State

CM YS Jagan: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధం

Mahendra Maheshwaram HT Telugu
Aug 26, 2022 02:09 PM IST

ap govt announced the ban on plastic flexis: విశాఖ వేదికగా పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... ఇకపై రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (twitter)

Plastic flexis Ban in Andhrapradesh: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖలోలో పర్యటించిన ఆయన.. ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్ పై ప్రకటన చేశారు.

ట్రెండింగ్ వార్తలు

CM Jgana on Plastic Ban: పర్యావరణం, సముద్రాన్ని కాపాడుకునేందుకు పార్లే ఓషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద బ్లీచింగ్‌ కార్యక్రమం విశాఖలో జరిగింద్న ముఖ్యమంత్రి... ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామనే దానిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. సముద్రంలో ఉన్న ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ వస్తుందన్న విషయాన్ని గుర్తించి... సముద్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,097 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ రోజు సముద్రాలను పరిశీలిస్తే..ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కనిపిస్తోందని.. వీటికి ఒక పరిష్కారం వెతికే దిశగా ఏపీ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు కంపెనీలను భాగస్వాములుగా ఆహ్వానించిందని.. ఒకటి గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టేయినబుల్‌ ప్లానెట్‌ వర్క్స్‌(జీఏఎస్‌పీ), మరొకటి పార్లే ఓషన్స్‌ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలు గ్లోబల్‌ ఫైనాన్స్‌ తీసుకువచ్చి పర్యావరణాన్ని కాపాడే విధంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు.

'పార్లే ఓషన్‌ సంస్థను పెట్టిన సెరిల్‌ రాబోయే రోజుల్లో ఏపీ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ దేశంలోనే కాదు. ప్రపంచానికే ఒక దిక్సూచిగా తయారవుతుంది. తద్వారా రూ.16 వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. వచ్చే ఆరేళ్లలో ఈ పెట్టుబడులు వస్తాయి. దాదాపుగా 20 వేల మందికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు వస్తాయి.' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇకపై బట్టతోనే

ap govt announced the ban on plastic flexis: రాష్ట్రంలో ఈ రోజు నుంచి ప్లాస్టిక్‌ ప్లెక్సీలు బ్యాన్‌ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎవరైనా ప్లెక్సీలు పెట్టాలనుకుంటే బట్టతో తయారు చేసినవి ఏర్పాటు చేసుకోవాని సూచించారు. టీటీడీలో ఇప్పటికే ప్లాస్టిక్‌ లేకుండా చేశారని... అక్కడ మంచి రిజల్ట్‌ కూడా వస్తోందని గుర్తు చేశారు. అక్కడ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు లేవన్న సీఎం... అన్నీ కూడా బట్టతోనే బ్యాగుల్లోనే అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ దిశగా అడుగులు వేద్దామని... ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

IPL_Entry_Point