Plastic ban : ‘ప్లాస్టిక్​’పై నిషేధం.. దేశవ్యాప్తంగా అమల్లోకి-plastic ban in india comes into effect from today july 1st ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Plastic Ban : ‘ప్లాస్టిక్​’పై నిషేధం.. దేశవ్యాప్తంగా అమల్లోకి

Plastic ban : ‘ప్లాస్టిక్​’పై నిషేధం.. దేశవ్యాప్తంగా అమల్లోకి

Sharath Chitturi HT Telugu

Plastic ban in India : ప్లాస్టిక్​ బ్యాన్​ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కాగా.. ఈ నిర్ణయంతో 10లక్షలమంది ప్రజలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తమవుతోంది.

ప్లాస్టిక్​పై నిషేధం (AFP)

Plastic ban in India : సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై భారత ప్రభుత్వం విధించిన నిషేధం శుక్రవారం అమల్లోకి వచ్చింది. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం, దిగుమ‌తి చేసుకోవ‌డం, నిల్వ చేసుకోవ‌డం, స‌ర‌ఫ‌రా చేయ‌డం, అమ్మ‌డం, వినియోగించ‌డంపైనా నిషేధం ఉంటుంది. కాగా ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధంగా లేమని మేన్యుఫ్యాక్చరింగ్​ అసొసియేషన్​ చెబుతోంది. తమ వద్ద ప్రత్యామ్నాయాలు లేవని అంటోంది.

తాజా నిబంధనల ప్రకారం.. ఇక డిసెంబర్​ 31 తర్వాత.. ప్లాస్టిక్​ బ్యాగుల మందాన్ని 75మైక్రాన్ల నుంచి 120 మైక్రాన్లకు పెంచాల్సి ఉంటుంది.

వీటిపైనే నిషేధం..

ప్లాస్టిక్ బాటిల్స్‌, ప్లాస్టిక్ స్టిర‌ర్స్‌, ప్లాస్టిక్ ప్లేట్స్‌, ప్లాస్టిక్ క‌ప్స్‌, ప్లాస్టిక్ గ్లాసెస్‌, ప్లాస్టిక్ ఫోర్క్స్‌, ప్లాస్టిక్ స్పూన్స్‌, ప్లాస్టిక్ క‌త్తులు, ప్లాస్టిక్ ట్రేలు, ప్లాస్టిక్‌ బేలూన్ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ ఐస్‌క్రీమ్ స్టిక్స్‌, క్యాండీ స్టిక్స్‌, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియ‌ల్‌, థ‌ర్మాకోల్ మెటీరియ‌ల్‌, ప్లాస్టిక్ జెండాలు,.. మొద‌లైన సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్ పదార్థాలపై నిషేధం విధించింది కేంద్రం.

ఏడాది క్రితమే చెప్పినా..

Single use plastic ban : సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై నిషేధాన్ని గతేడాది ఆగస్టులోనే ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి వివిధ వర్గాలతో చర్చలు జరుపుతూ వస్తోంది. గురువారం.. 82 నగరాల ప్రతినిధులతో కేంద్ర పర్యావరణశాఖ అధికారులు సమావేశమయ్యారు. నిషేధం అమలుపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సింగల్​ యూజ్​ ప్లాస్టిక్​పై నిషేధాన్ని విస్మరిస్తే.. కఠిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇవి నిషేధిత ప్లాస్టిక్స్ ఉత్ప‌త్తిని, దిగుమ‌తిని, నిల్వ‌ను, స‌ర‌ఫ‌రాను, అమ్మ‌కాల‌ను, వినియోగాన్ని అడ్డుకోవాల్సి ఉంటుంది.

కాగా.. దేశవ్యాప్తంగా 88వేల ఎమ్​ఎస్​ఎమ్​ఈలు.. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వస్తువులను తయారు చేస్తున్నాయి. తాజా నిషేధంతో 10లక్షలమందికిపైగా ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆల్​ ఇండియా ప్లాస్టిక్స్​ మేన్యుఫ్యాక్చరర్స్​ అసోసియేషన్​ ఆవేదన వ్యక్తం చేసింది.​

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.