plastic ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌.. వేటిపై ఈ నిషేధ‌మో తెలుసా?-plastic ban india to ban these single use plastic items from friday ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Plastic Ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌.. వేటిపై ఈ నిషేధ‌మో తెలుసా?

plastic ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌.. వేటిపై ఈ నిషేధ‌మో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 05:21 PM IST

single-use plastic ban : జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్ప‌త్తులు బ్యాన్ కానున్నాయి. ఒక‌సారి మాత్ర‌మే వినియోగించే ప్లాస్టిక్‌ వ‌స్తువులను ఉత్ప‌త్తి చేయ‌డం నుంచి వినియోగించ‌డం వ‌ర‌కు.. అన్నిటిపై ఈ నిషేధం వ‌ర్తిస్తుంది.

<p>ప్ర‌తీకాత్మక చిత్రం</p>
ప్ర‌తీకాత్మక చిత్రం

single-use plastic ban : ప్లాస్టిక్ ఉత్ప‌త్తుల‌ను నిషేధించాల‌నే డిమాండ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా రోజులుగా ఉంది. ప‌ర్యావ‌ర‌ణానికి ఈ ప్లాస్టిక్ చేసే హాని అర్థ‌మైన త‌రువాత‌, ఈ డిమాండ్ మ‌రింత ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో అనేక దేశాల్లో వివిధ ర‌కాలైన ప్లాస్టిక్‌పై ప్ర‌భుత్వాలు నిషేధం విధించాయి. కొస్టారికా ఇప్ప‌టికే `ప్లాస్టిక్ ఫ్రీ` దేశంగా ఉంది. భార‌త్‌లో కూడా 75 మైక్రాన్ల లోపు మందం ఉన్న‌ ప్లాస్టిక్స్ పై నిషేధం ఉంది.

single-use plastic ban : ఆ ప్లాస్టిక్స్ పై నిషేధం.. ఉత్ప‌త్తి నుంచి వినియోగం వ‌ర‌కు

వేస్టేజ్‌కి ఎక్కువ అవ‌కాశం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్ప‌త్తుల‌పై భార‌త్‌లో జులై 1 నుంచి నిషేధం అమ‌లు కానుంది. ఆ ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం, దిగుమ‌తి చేసుకోవ‌డం, నిల్వ చేసుకోవ‌డం, స‌ర‌ఫ‌రా చేయ‌డం, అమ్మ‌డం, వినియోగించ‌డం.. వీట‌న్నిటిపై ఈ నిషేధం వ‌ర్తిస్తుంది. ఇలాంటి దాదాపు 19 ర‌కాల ప్లాస్టిక్ ఉత్ప‌త్తుల‌ను గుర్తించారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, అంత‌ర్జాతీయ వాతావ‌ర‌ణ‌మార్పు నిబంధ‌న‌ల అమ‌ల్లో భాగంగా ఈ నిషేధం విధించారు. ముఖ్యంగా స‌ముద్ర జీవుల‌పై, జీవ సంబంధ వ్య‌వ‌స్థ‌ల‌పై ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌ని గుర్తించిన నేప‌థ్యంలో ఈ నిషేధం అనివార్య‌మైంది.

అన్నింటిపై నిషేధం వ‌ద్దు

అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌పై నిషేధం విధించ‌వ‌ద్ద‌ని థ‌ర్మోఫార్మ‌ర్స్ అండ్ అలీడ్ ఇండస్ట్రీస్ అసోసియేష‌న్‌ (Thermoformers and Allied Industries Association - TAIA) కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ బ్లాంకెట్ బ్యాన్ వ‌ల్ల చాలా వ్యాపారాలు భారీగా న‌ష్ట‌పోతాయ‌ని తెలిపింది. అందువ‌ల్ల‌, ప‌లు అంచెల్లో ఈ నిషేధాన్ని అమ‌లు చేయాల‌ని సూచించింది.

single-use plastic ban : ఏయే వ‌స్తువుల‌పై నిషేధం అంటే..

ప్ర‌భుత్వం విధించిన ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్ప‌త్తులు ఏంటంటే.. ప్లాస్టిక్ బాటిల్స్‌, ప్లాస్టిక్ స్టిర‌ర్స్‌, ప్లాస్టిక్ ప్లేట్స్‌, ప్లాస్టిక్ క‌ప్స్‌, ప్లాస్టిక్ గ్లాసెస్‌, ప్లాస్టిక్ ఫోర్క్స్‌, ప్లాస్టిక్ స్పూన్స్‌, ప్లాస్టిక్ క‌త్తులు, ప్లాస్టిక్ ట్రేలు, ప్లాస్టిక్‌ బేలూన్ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ ఐస్‌క్రీమ్ స్టిక్స్‌, క్యాండీ స్టిక్స్‌, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియ‌ల్‌, థ‌ర్మాకోల్ మెటీరియ‌ల్‌, ప్లాస్టిక్ జెండాలు,.. మొద‌లైన‌వి ఈ జాబితాలో ఉన్నాయి.

క‌ఠినంగా అమ‌లు

ఈ ప్లాస్టిక్ బ్యాన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇవి నిషేధిత ప్లాస్టిక్స్ ఉత్ప‌త్తిని, దిగుమ‌తిని, నిల్వ‌ను, స‌ర‌ఫ‌రాను, అమ్మ‌కాల‌ను, వినియోగాన్ని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే భార‌త్‌లో 75 మైక్రాన్ల‌లోపు మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల‌పై నిషేధం ఉంది. అలాగే, 2023 జ‌న‌వ‌రి 1 నుంచి 120 మైక్రాన్ల మందం లోపు ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల‌పై కూడా నిషేధం ఉంటుంది.

Whats_app_banner