Munugodu: కాంగ్రెస్ నిర్ణయంతో కేసీఆర్ వ్యూహం మారిందా..? ప్లాన్ ‘బీ’ రెడీ చేశారా?-who is the trs candidate in munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu: కాంగ్రెస్ నిర్ణయంతో కేసీఆర్ వ్యూహం మారిందా..? ప్లాన్ ‘బీ’ రెడీ చేశారా?

Munugodu: కాంగ్రెస్ నిర్ణయంతో కేసీఆర్ వ్యూహం మారిందా..? ప్లాన్ ‘బీ’ రెడీ చేశారా?

Mahendra Maheshwaram HT Telugu
Sep 10, 2022 03:31 PM IST

Munugodu Politics: మునుగోడు రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ నుంచే అలర్ట్ అయిన ప్రధాన పార్టీలు... ఎవరికి వారు పావులు కదుపుతూనే వచ్చాయి. బైపోల్ బరిలో ఉండే అభ్యర్థులు విషయంలో బీజేపీనే కాదు కాంగ్రెస్ కూడా క్లారిటీ ఇచ్చేసింది. అయితే హస్తం అభ్యర్థి ఖరారు కావటంతో... టీఆర్ఎస్ ప్లాన్ ‘బీ’ ని అమలు చేసే పనిలో ఉందనే టాక్ వినిపిస్తోంది.

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..?
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..? (HT)

trs candidate for munugodu bypoll 2022: నియోజకవర్గం ఒక్కటే... దాదాపు అందరూ లోకల్ లీడర్లే..! అందులోనూ అధికార పార్టీ... కానీ ఎవరి రూట్లు వారిదే... ఎవరి లెక్క వారిదే..! టార్గెట్ 2023 అన్నట్లు అడుగులు వేశారు. అయితే అనూహ్యంగా బైపోల్ రావటంతో... సీన్ కాస్త చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఎవరి లైన్ లో వారు... ప్రయత్నాల్లో మునిగిపోయారు! అయితే 2018లో ఓడిపోయిన కూసుకుంట్లకే టికెట్ అన్న లీక్ లు రావటంతో.. ఆశావహులు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు కావటంతో... గులాబీ పార్టీ సరికొత్త అస్త్రాన్ని వాడే విషయంపై కసరత్తు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి రేసులో ఉండేది ఎవరూ..?టికెట్ కొట్టేదెవరు..? అసలు గులాబీ బాస్ కేసీఆర్ ఏం చేయబోతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.

ప్లాన్ మార్చబోతున్నారా..?

trs on munugodu bypoll: మునుగోడు విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ క్లారిటీతోనే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని తాజా పరిణామాలతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి ఎంపికను బట్టి కూడా ప్లాన్ సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవటం ఖాయం కాగా... కాంగ్రెస్ పార్టీ మాత్రం సుదీర్ఘ కసరత్తు చేసింది. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే కలిసి వచ్చే ఛాన్స్ ఉందని భావించినప్పటికీ... ఫైనల్ గా రెడ్డి సామాజికవర్గానికి చెందిన పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా నిర్ణయించింది. సరిగ్గా ఈ నిర్ణయమే టీఆర్ఎస్ పార్టీ ని డైలామాలో పడేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామానే తమకు అనుకూలంగా మార్చే పనిలో పడినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బీసీ కార్డును ప్రయోగిస్తుందా..?

రెండు ప్రధాన పార్టీలు ఓసీ వర్గానికి టికెట్ ఇచ్చేశాయి. అయితే మునుగోడులో లక్షకు పైగా ఓట్లు బీసీ వర్గాలకు చెందినవి ఉన్నాయి. అందులోనూ గౌడ సామాజికవర్గం అగ్రస్థానంలో ఉంది. అయితే మునుగోడు బైపోలో బీసీ కార్డును అస్త్రంగా ఉపయోగించే యోచనలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్థానంపై ఇప్పటికే కన్నేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను అభ్యర్థిగా నిర్ణయిస్తే ఎలా ఉంటుందనే విషయంపై సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందంటూ లీక్ లు కూడా రావటం మొదలైంది. బీసీ కార్డు అస్త్రం తప్పకుండా పని చేసే అవకాశం ఉందని పక్కా లెక్కలు వేస్తుందంట టీఆర్ఎస్. దానికితోడు నర్సయ్య గౌడ్ భువనగిరి మాజీ ఎంపీగా పని చేయటం కూడా పార్టీకి కలిసివస్తుందని భావిస్తోందంట..! ఇదే విషయంపై పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మునుగోడు బరిని ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్ గా భావిస్తున్న నేపథ్యంలో... కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ క్యాండిడెట్లు ఖరారుకాగా... అధికార టీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ దక్కబోతుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అన్నింటిని లెక్కల్లోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్లకే టికెట్ దక్కుతుందా...? లేక సామాజిక సమీకరణాల్లో భాగంగా నర్సయ్య గౌడ్ కు టికెట్ ఇచ్చి బరిలో నిలుపుతారా..? అనేది చూడాలి...!

IPL_Entry_Point