TSPSC: ఆఫీస్ లోకి ఫోన్లు, పెన్ డ్రైవ్స్ బంద్..! కీలక మార్పులపై TSPSC ఫోకస్-tspsc employees can not carry phones and pen drives to office ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Employees Can Not Carry Phones And Pen Drives To Office

TSPSC: ఆఫీస్ లోకి ఫోన్లు, పెన్ డ్రైవ్స్ బంద్..! కీలక మార్పులపై TSPSC ఫోకస్

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 10:01 AM IST

TSPSC Plan To Ban Mobile Phones:పేపర్ లీక్ వ్యవహారం దృష్ట్యా కీలక అంశాలపై ఫోకస్ పెట్టింజి టీఎస్‌పీఎస్సీ. శుక్రవారం నిర్వహించిన కీలక భేటీలో… పలు నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు

TSPSC Latest News: టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విచారణలో తవ్వే కొద్దే అక్రమాలు బయటికి వస్తున్నాయి. తాజాగా వచ్చిన రిమాండ్ రిపోర్టులో కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 12 మందిని అరెస్ట్ చేయటంతో పాటు 19 మందిని సాక్షులుగా పేర్కొంది. ఇదిలా ఉంటే... కమిషన్ లో తీసుకురావాల్సిన మార్పులపై కూడా టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఛైర్మన్ అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించారు.

భవిష్యత్తులో పేపర్ లీక్ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టం తీసుకురావాలని యోచిస్తోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ముఖ్యంగా కమిషన్ లోకి సెల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లకు అనుమతి ఇవ్వకూడదని భావిస్తున్నది. లోపలికి తీసుకురాకుండా... బయటనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలని చూస్తోంది. పేపర్ లీకేజీ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఆన్ లైన్ విధానంలో పరీక్షలు, పరీక్షల రీషెడ్యూల్ పై చర్చించారు.

కమిషన్ నిర్వహించే పరీక్షలన్నింటిని ఇకపై ఆన్‌లైన్‌ లోనే నిర్వహించాలని చూస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతి అనుసరించేలా కార్యచరణను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇక ఉద్యోగాల భర్తీకి కూడా ప్రత్యేక విధానం రూపొందించాలని అధికారులు చర్చించారు. కమిషన్ పరిధిలో ప్రత్యేక నియమావళిని తీసుకురావటంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఉద్యోగుల పని విధానం, ఉద్యోగుల పరివర్తన, పరీక్ష నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని చూస్తోంది. పరీక్షలు, దరఖాస్తులకు సంబంధించి అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటే... కార్యాలయానికి రాకుండా ఆన్ లైన్ లోనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేయటంపై కసరత్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ వ్యవస్థను పటిష్టం చేయాలని యోచిస్తోంది.

TSPSC Paper Leak Case Updates: మరోవైపు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించింది సిట్. పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు తెలిపింది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్లు ప్రస్తావించింది. ఇప్పటివరకు మొత్తం నలుగురు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల అరెస్ట్ కాగా... నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. 19 మంది సాక్ష్యుల ను విచారించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేసింది.

టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షి గా పేర్కొంది సిట్. శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్పీఎస్సీ , తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులు గా నమోదు చేసింది. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని కూడా సాక్షి గా ప్రస్తావించింది. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో నిక్షిప్తమైన పేపర్ ఎక్సెంజ్ వ్యవహారాన్ని నిక్షిప్తం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను ఆరెస్ట్ చేసినట్లు ప్రకటించగా... ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. మరోవైపు తాజాగా గురువారం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోరింది సిట్‌. మరోవైపు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిలో చూస్తే… A1గా ప్రవీణ్ , A2 గా నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి, A10గా ఏఎస్వో షమీమ్, A12గా డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. ఇక ఏ3గా రేణుకా రాథోడ్, ఏ4గా ఢాక్యా నాయక్, ఏ5గా కోటేశ్వర్, ఏ6గా నిలేష్ నాయక్ పేర్లను ప్రస్తావించింది సిట్.

ఇదిలా ఉంటే… ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉంటున్న తన బావ ప్రశాంత్‌కు గ్రూప్‌-1 ప్రశ్నపత్రం పంపించినట్లు గుర్తించింది సిట్. అతడికి కూడా నోటీసులు పంపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం