Munugodu Voter List: ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ.. 7 వేల దరఖాస్తులు తిరస్కరణ-ts high court hearings on new voter list in the wake of the munugode bypoll 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Voter List: ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ.. 7 వేల దరఖాస్తులు తిరస్కరణ

Munugodu Voter List: ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ.. 7 వేల దరఖాస్తులు తిరస్కరణ

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 04:52 PM IST

TS HC On Munugodu Voter List: మునుగోడు ఓటర్ల సవరణ జాబి7 వేల దరఖాస్తులు తిరస్కరణతాపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టు విచారణ
మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టు విచారణ (tshc)

TS High Court On New Voter List Munugodu: మునుగోడు ఎన్నికల జాబితాపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల జాబితా నివేదికను హైకోర్టుకు సమర్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 25 వేల ఓట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని పేర్కొంది. మరో 7 వేల ఓట్లు నమోదును తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న ఓటర్లు ప్రక్రియను నిలిపేయాలని పిటిషనర్ కోరగా... ఏకీభవించిన ధర్మాసనం పెండింగ్‌లో ఉన్న ఓటరు జాబితా నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 21కు వాయిదా వేసింది.

హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ...

BJP On Munugodu New Voter List: మునుగోడు నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఫేక్ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉప ఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని కోర్టును బీజేపీ కోరింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో అభ్యర్థించింది. గత కొద్ది నెలల సమయంలోనే మునుగోడులో 25 వేల వరకూ కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయని వివరించింది. ఫాం 6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపణ చేసింది. ఈ నెల 14న మునుగోడు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని, ఆ లిస్ట్‌ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీజేపీ కోరింది. కొత్తగా ఓట్ల కోసం అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య ఈ 2 నెలల్లోనే 25 వేలు దాటిందని పిటిషన్ లో పేర్కొంది.

మునుగోడు ఓటర్ల జాబితా విషయంపై హైకోర్టు గురువారం కూడా విచారణ జరిపింది. పూర్తి ఓటర్ల జాబితాకు సంబంధించి రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రువారం పూర్తి నివేదికను ఈసీ ఇవ్వటంతో... తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

IPL_Entry_Point